ఫిల్మ్ నగర్ భూకేటాయింపులో కేసీఆర్ వాటా ఎంత ?
గుడిని కూల్చడం కేసీఆర్ కి తగునా ?: ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్
శ్రావణ్ చేసిన తీవ్రమైన ఆరోపణలు
*ఫిలింనగర్లో వున్న రూ.1500కోట్ల విలువైన భూమిని రెడ్‌ఫోర్ట్ అక్బర్ ప్రైవేట్ ప్రాపర్టీస్ సంస్థకు అప్పనంగా కేవలం రూ 286 కోట్లకు కేటాయించింది కేసీఆర్ సర్కార్. స్థానికంగా కొండపై ఉన్న ఆంజనేయస్వామి గుడిని కూడా కూల్చివేశారు. గుడిని కూల్చుతుంటే బిజెపి మౌనవ్రతం ఎందుకు ? నియోజక వర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎందుకు మాట్లాడటం లేదు ?
* కేవలం రూ. 286 కోట్లుకి రూ 1500 కోట్ల రూపాయిలు విలువ చేసే ఫిలిం నగర్ భూములు కట్టబెడుతున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కేసీఆర్ వ్యవహరించడం న్యాయమా ? ఎంపీ రంజిత్ రెడ్డి , హిందూ ప్రాజెక్ట్స్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలంగాణకి అల్లుళ్ళా?
*తెలంగాణ వ్యతిరేకని ముద్రపడ్డ కిరణ్ కుమార్ రెడ్డి నాడు తెలంగాణ భూములు కబ్జాకి గురి కాకుండా అడ్డుకుంటే నేడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూములు ఎగిరి అవుతున్నాయి. రక్షించాల్సిన భాద్యత గల టీఆర్ఎస్ ప్రభుత్వం, సిఎం కేసీఆర్ ..అక్రమంగా కట్టబెడుతున్నారు. ఇదేం న్యాయం ? కిరణ్ కుమార్ రెడ్డికి వున్న సోయి కేసీఆర్ కి లేదా?
*ఊరు బయట బాచుపల్లి భూములకు , హైదరాబద్ నడిగడ్డ ఫిల్మ్ నగర్ భూములకు ఏమైనా పొంతన ఉందా ? కేసులు వేయించి ఎలాగైనా ఖరీదైన ఫిల్మ్ నగర్ భూములు కబ్జా చేయించాలని హిందూ ఇన్ఫ్రా ,రెడ్‌ఫోర్ట్ అక్బర్ ప్రైవేట్ ప్రాపర్టీస్ కుట్ర చేసింది. ఈ కుట్రకు కేసీఆర్ సహకరించడం న్యాయమా?
*కంచె చేను మేసినట్లు ఎంపీ రంజిత్ రెడ్డికి అక్రమంగా భూ కేటాయింపులు చేసిన కేసీఆర్. అక్రమంగా కేటాయించిన భూమీని రద్దు చేయాలి. విచారణ జరిపి అక్రమ భూకేటాయింపు కుట్రలో దోషులందరినీ శిక్షంచాలి.
ఇదీ స్కాం
“2010లో ఫిలిం నగర్ భూములు కేటాయించారు. కేటాయించిన తర్వాత ఏవో కారణాలు చేత డిల్ వాటిని వెనక్కి తీసుకుంటామని, వాటిని వేలం వేస్తామని చెప్పింది. వేలం పెట్టిన తర్వాత హిందూ ప్రాజెక్ట్స్, రెడ్‌ఫోర్ట్ అక్బర్ ప్రైవేట్ ప్రాపర్టీస్ బిడ్ వేసి అగ్రగామిగ నిలిచి వాటిని సొంతం చేసుకోవడం జరిగింది. వేలం తర్వాత వీటిని చట్టం బద్దం చేయండని అప్లికేషన్ పెట్టుకుంటే నాడు సిఎం గా వున్న కిరణ్ కుమార్ రెడ్డి ఈ వ్యవహారం మొత్తం గమనించి ఫైల్ ని పక్కన పెట్టేశారు. 2018 లో సుప్రీం కోర్టు ట్రిబ్యునల్ రూ.285కోట్లు కాదు వడ్డీలతో కలిపి రూ. 521కోట్లు 39లక్షల 50వేలు కట్టమని ఆర్డర్ ఇచ్చింది. మొత్తనికి 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఫైల్ ని పక్కన పెడితే , 2018 తర్వాత ట్రిబ్యునల్ ఆర్డర్ ఇస్తే కేసీఆర్ , చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఇద్దరూ కూడా కుమ్మక్కయి రూ. 1500కోట్ల రూపాయిలు విలువ చేసే భూమిని రెడ్‌ఫోర్ట్ అక్బర్ ప్రైవేట్ ప్రాపర్టీస్ కి అప్పనంగా కట్టేబెట్టె కుట్ర చేస్తున్నారు. హిందూ ప్రాజెక్ట్స్ వారి స్పెషల్ పర్పస్ వెహికిల్ రెడ్‌ఫోర్ట్ అక్బర్ ప్రైవేట్ ప్రాపర్టీస్. రెడ్‌ఫోర్ట్ అక్బర్ ప్రైవేట్ ప్రాపర్టీస్ వారికి భూములు కేటాయించగానే వాటిని డెవలప్ చేసుకోవడానికి డిఎస్ఆర్ ప్రైమ్ అనే కన్ స్ట్రక్షన్ కంపనీ సీన్ లోకి వచ్చింది. 30, 40 టవర్ల బిడ్లింగ్స్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. డిఎస్ఆర్ ప్రైమ్ ఎక్కడిది ? దిని వెనుక ఎవరు వున్నారు ? ఇందులో శ్యామ్ ప్రసాద్ రెడ్డి, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కి సంబధించిన వారు వున్నారు. దొంగలు దొంగలు కలసి దేశాలు పంచుకున్నట్లు .. ఈ రోజు హైదరాబద్ లోన్ ఖరీదైనా భూములు కబ్జా చేశారనేదానికి నిదర్శనం” అని వెల్లడించారు దాసోజు.