(ఈటెల రాజేందర్)
రాజకీయాలకే మచ్చతెచ్చేలా నీచపు, నికృష్టపు సంప్రదాయాలకు కేసీఆర్ తెరలేపాడు.
కేసీఆర్ చరిత్ర భవిష్యత్తులో ఏం చేసాడని చదువుకోవాలంటే.. హుజురాబాద్ లో ఆయన చేసిన కుట్రలు గురించి చదువుకోవాల్సి ఉంటుంది.
సొంత పార్టీ నాయకులకే వెలకట్టి కొనుగోలు చేసే నీచపు సంస్కృతి కొనసాగుతోంది.
పాత నాయకులను దగ్గరకి రానీయకపోతే.. ఈటల ఒంటరి అవుతాడని వాళ్లు అనుకుంటున్నారు.
2023 ఎన్నికలకు హుజురాబాద్ ఎన్నిక రిహార్సల్ లాంటిది…అందుకే కేసీఆర్ భయపడుతున్నాడు.
ఎన్ని వందల కోట్లైనా ఖర్చు చేసి, అసెంబ్లీలో నా ముఖం కనిపించకూడదని కేసీఆర్ పంతంపట్టాడు.
నేను రేపు గెలిస్తే.. అసెంబ్లీలో నా ముఖం అసెంబ్లీలో చూసే శక్తి నీకు లేదు కాబట్టి, తట్టుకోవు కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేసాను.
కేసీఆర్ కాదు కదా.. ఆయన జేజెమ్మ దిగివచ్చినా ఇక్కడ మీరు గెలవలేరు.
నీకు ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా.. ఇక్కడ బెదిరింపులు, ప్రలోభాలు ఆపు. ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడితే మీకు డిపాజిట్ కూడా దక్కదు.
హుజురాబాద్ చైతన్యానికి మారుపేరు. నిఖార్సైన తెలంగాణ రోషం ఈ గడ్డమీద ఉంటుంది.
ఆకలినైనా భరిస్తుంది తప్ప.. ఆత్మగౌరవాని కోల్పోదు ఈ గడ్డ.
కరీంనగర్: హుజురాబాద్ మధువని గార్డెన్ లో బీజేపీ పన్నా ప్రముఖ్ లతో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇతర నేతలు ఇందులో ఉన్నారు. అక్కడ ఈటల రాజేందర్ కామెంట్స్
ఈ దేశాన్ని పాలించే జాతీయ పార్టీ ఇది. ఒకవేళ నిజంగా కోపమొచ్చి బీజేపీ ఊదితే కొట్టుకుపోయే పార్టీ టీఆర్ఎస్
300 మంది ఎంపీలు, ప్రపంచంలోనే ఎక్కువ సభ్యుత్వం ఉన్న బీజేపీ, దేశంలో 18 రాష్ట్రాలను పాలిస్తోంది.
ఇలాంటి పార్టీ మీద మీరు ఇంత దాదాగిరి చేస్తున్నారు. నీకే గింతఉంటే.. మాకెంత ఉండాలే?
మాకు సహనం ఓపిక ఉంది. మీ తప్పులను లెక్కలు పెడుతున్నాం. సందర్భం వస్తే మీ భరతం పడతాం.
ఇప్పటికైనా చిల్లర మల్లర పోలీసు యాక్షన్స్, బెదిరింపులు ఆపండి.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు చూడకుండా ఇలాంటి పనులు చేస్తుంటాడు.
అనేక ముఖ్యమంత్రులను, అనేక నాయకులను చూసాను. కానీ ఇట్లాంటి సిస్టం ఆ పార్టీలో మాత్రమే ఉంటుంది.
ఈటల రాజేందర్ ఒకవేళ ఓడితే.. మిగతా నాయకులంతా బానిసత్వంలోకి జారిపోతారు.
మనం గట్టిగా పట్టుబడితే టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేయొచ్చు.