ఆంధ్రాకు భారీ వర్షాల హెచ్చరిక

నిన్న ఏర్పడిన అల్పపీడనం బలపడి ఈరోజు దక్షిణ చత్తీస్ గడ్ & దానిని అనుకొని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాలలో కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళే కొలది నైఋతి దిశ వైపుకు వంగి కొనసాగుతున్నది. రాగల 2 రోజులలో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.

ఈరోజు షీర్ జోన్ (ద్రోణీి) 18°N అక్షాంశము వెంబడి సగటు సముద్రమట్టానికి 3.1 km నుండి 7.6 km ఎత్తుల మధ్య విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి, పైన తెలిపిన అల్పపీడనము నకు అనుబంధముగా ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా కొనసాగుతున్నది.

వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన:

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :

ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. మరియు విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి ఈదురు గాలులు 40-50 kmph, గరిష్టంగా 60 kmph వేగంతో వీచే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి ఈదురు గాలులు 40-50 kmph, గరిష్టంగా 60 kmph వేగంతో వీచే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:
ఈరోజు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

సంచాలకులు,అమరావతి వాతావరణ కేంద్రము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *