గత సెప్టెంబర్ 7 న మా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు: విఆర్ వొల ఆగ్రహం

(తెలంగాణ గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం)

*సెప్టెంబర్ 7 తారీఖు 2020 ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు మా దగ్గర ఉన్న రికార్డులు ఫైల్స్ హడావుడిగా లాక్కున్న రోజు 7 తారీఖున మాకు చెడు అనుభూతి

*ముఖ్యమంత్రి గారి నిర్ణయం మాకు బాధ కలిగించింది మాతో ఒక్కరోజన్నా మాట్లాడకుండా సంఘాన్ని పిలిపించ కుండా ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

మేము దేశద్రోహులము కాదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగం ఉద్యమ బిడ్డలం ఆంధ్ర పాలకులను వెనుకకు పంపించడం లో మా కృషి ఉన్నది.

తెలంగాణ ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లతో గాయాలపాలయ్యాము
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడము
అప్పుడు ఉన్న ఉమ్మడి పది జిల్లా కలెక్టర్ కార్యాలయాల కు తాళాలు వేశాం.

* ఇంచు భూమి పోకుండా రికార్డులను శుద్ధి చేశాము
అదే ఫలితంగా ఇప్పుడు రైతులు రైతుబంధు ను తీసుకుంటున్నారు

* ఆ రికార్డుల ఆధారంగానే ధరణి వెబ్ సైట్ రూపుదిద్దుకుంది.

*ధరణి ద్వారా ఎక్కువ శాతం రైతులకు సేవలు అందుతున్నాయి.

*ధరణి లో కొన్ని సాంకేతిక కారణాల వలన ఇబ్బందులు ఉన్నాయి తద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు..
ఇబ్బందులు విషయాలు తాసిల్దారు చెప్పుకోలేక సతమతమవుతున్నారు.

* గ్రామ వ్యవస్థ లేకుండా గ్రామ ప్రజలతో పాటు ఉన్నత అధికారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు

* అన్ని రాష్ట్రాలలో గ్రామ రెవెన్యూ పాలన ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం రద్దు చేశారు రద్దు చేసినప్పటికీ ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఏర్పాటు చేయలేదు

*అటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి ప్రజల సమస్యలను ఉన్నతాధికారులతో సమీక్షించి తద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అనేకమైన సంక్షేమ పథకాలలో కృషి చేశాము..

*భారతదేశం గర్వించదగ్గ సంక్షేమ పథకం రైతు బంధు రైతుబంధు సంపూర్ణ విజయవంతం చేయడంలో గ్రామ రెవెన్యూ అధికారుల పాత్ర ఎక్కువ భాగం

*తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి సంపూర్ణ విజయవంతం చేయడంలో గ్రామ రెవెన్యూ అధికారులు పాత్ర కీలకం.

* గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు అయినప్పటి నుండి ఇప్పటివరకు గ్రామ రెవెన్యూ అధికారులు గానే కొనసాగుతూ అప్పుడు అధికారికంగా అన్ని పనులు చేశాము ఇప్పుడు జాబ్ చార్ట్ లేకున్నా అప్పుడు చేసే పనికన్నా ఇప్పుడు ఎక్కువ పని చేస్తున్నాం

*ఇప్పుడు ఇస్తున్న టువంటి దళిత బంధు సంక్షేమ పథకం లో గ్రామాలలో గ్రామ రెవెన్యూ అధికారులు లబ్ధిదారుల గుర్తింపు కోసం సర్వే చేస్తున్నాం తద్వారా దళిత బంధు పథకం కూడా విజయవంతం కాబోతుంది

సెప్టెంబర్ మొదటి వారంలో ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ గత రెండు మూడు రోజుల నుండి వర్షాల కారణంగా రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ అత్యవసర సేవలు చేయాల్సి ఉన్నందున వరద బాధితుల కోసం అనగా విపత్కర పరిస్థితిలో సేవలు చేయాల్సిన అవసరం ఉన్నందున త్వరలో మరో తేదీ ప్రకటించి ఆత్మగౌరవ సభను నిర్వహిస్తాం

*ఈ రాష్ట్రంలోపని చేస్తున్న 5485 గ్రామ రెవెన్యూ అధికారులకు  వారికి
సరిసమానమైన హోదాను కల్పిస్తూ రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలి

*జాబ్ చార్ట్ ను ప్రకటించాలి

సీనియారిటీ భంగం కాకుండా చూడాలి

*కారుణ్య నియామకం చేపట్టాలి

*గ్రామ రెవెన్యూ అధికారులకు రావలసిన ఇంక్రిమెంట్ లను విడుదల చేయాలి

*జోనల్ వ్యవస్థ ట్రాన్స్ఫర్స్ లో వీ ఆర్ వో లకు అవకాశం కల్పించాలి

పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన రెవెన్యూ శాఖలో క్యాడర్ మెరుగుపరిచి మరీ ఎక్కువ సేవలు చేసే విధంగా కృషి చేయాలి

*వీఆర్ఏ నుండి డిప్యూటీ కలెక్టర్ ల వరకు వారి వారి అర్హతను బట్టి ప్రమోషన్ లను కల్పించాలి

* ముఖ్యమంత్రి గారి హామీ మేరకు వీఆర్ఏల పే స్కేల్ ను వెంటనే ప్రకటించి వారిని వారి కుటుంబాల సంక్షేమాన్ని చూడాలి

*అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాలతో పాటు ఆర్డీవో కార్యాలయంలో తాసిల్దార్ కార్యాలయల సొంత భవనాలు నిర్మాణం చేయాలి

*సమగ్ర భూ సర్వే జరిపించాలి

*ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన మరియు సమస్యలకు సంబంధించిన విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రతి మూడు నెలలకోసారి కలెక్టర్ గారి దగ్గర స్టాప్ కౌన్సిల్ నిర్వహించాలి

*ప్రతి ఆరు నెలలకోసారి ఉద్యోగుల సమస్యలపై సి సి ఎల్ ఎ గారి దగ్గర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి

*ఇప్పుడు మాకు సిసిఎల్ఎ లేరు కాబట్టి చీఫ్ సెక్రెటరీ గారి దగ్గర జాయింట్ స్టాప్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి

-తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

గోల్కొండ సతీష్, రాష్ట్ర అధ్యక్షులు
పల్లె పాటి నరేష్, ప్రధాన కార్యదర్శి
కాoదారి బిక్షపతి, సహా అధ్యక్షులు
మౌలానా ఉపాధ్యక్షులు
రామేశ్వర రావు, ఉపాధ్యక్షులు
ఆశన్న, ఉపాధ్యక్షులు
రమేష్, ఉపాధ్యక్షులు
మురళి, ఉపాధ్యక్షులు

రమేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాంచందర్, కల్చరల్ సెక్రెటరీ. రాజన్న సర్వేష్, రాష్ట్ర నాయకులు
వెంకటేష్, జాయింట్ సెక్రెటరీ
రమేష్, కోశాధికారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *