సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదా?: కేంద్రాన్ని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి

ట్రిబ్యునళ్ళలో ఖాళీల భర్తీ విషయంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్స్ లోని ఖాళీను పూరించేందుకు ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి సంబంధించిన పిటిషన్ విచారిస్తూ కోర్టు ఈ అసంతృప్తి వ్యక్తం చేసింది.

అని చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ,జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరావుల ధర్మాసనం వ్యఖ్యానించింది. తన అసంతృప్తిని ధర్మాసనం నేరుగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ద్వారా కేంద్రానికి తెలియ చేసింది.

కేంద్రం తీసుకువచ్చిన ‘ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ యాక్ట్’ (Tribunals Reforms Act) ని ప్రస్తావిస్తూ ఏ విషయాలను కోర్టు కొట్టి వేసిందో వాటినే యాక్ట్ లో పొందుపర్చడం పట్ల కోర్టు  ఆశ్యర్యం వ్యక్తం చేసిందని లైవ్ లా (Livelaw) రిపోర్టుచేసింది.

“There is no respect to judgments of this court.  You are testing our patience!  How many persons were appointed?  You said some persons were appointed? Where are the appointments?” అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.

ట్రిబ్యునల్స్ యాక్ట్ గురించి ప్రస్తావిస్తూ, “ The Tribunals Act is virtually a replica of the provisions struck down by this court in the Madras Bar Association,” అని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించా,రు.

గతంలో వచ్చిన రెండు మద్రాస్ బార్ అసోసియేషన్ తీర్పులను రాసిన  జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు  మాట్లాడుతూ గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులను అనుసరిస్తూ ట్రిబ్యునల్స్ కు ఎందుకు నియామకాలు జరపడం లేదో చెప్పాలని సాలిసిటర్ జనరల్ ను అడిగారు. ఆయన  ప్రభుత్వ ధోరణి మీద తీవ్రంగా స్పందించారు. “ You are emasculating these tribunals by not appointing members. Many tribunals are on the verge of closing down,” అని అన్నారు.

తాము తీవ్ర అసంతృప్తికి లోనయ్యామని ప్రధాన న్యాయమూర్తి రమణ వ్యాఖ్యానించారు. ఇక ట్రిబ్యునళ్లను మూసేయంటారా అని కూడ ఆయన అన్నారు.

“ We have only three options. One, we stay the legislation. Two, we close down the tribunals and give the power to the High Court. Three, we ourselves make the appointments,” అని వ్యాఖ్యానించారు.

దీనికి సాలిసిటర్ జనరల్ స్పందిస్తూ  తాను రెండు మూడు రోజులలో  కోర్టు వివరాలు నివేదిస్తానని అన్నారు. సెర్చ్ కమిటి సిఫార్సులను బట్టి ట్రిబ్యునల్స్ కు నియామకాలు రెండువారాల్లోపు చేస్తామని  వచ్చిన ఆర్థిక శాఖ సమాచారాన్ని ఆయన కోర్టుకు నివేదించారు.కోర్టు విచారణనువచ్చే సోమవారానికివాయిదా వేసింది.అప్పటిలోగా ట్రిబ్యునళ్ళలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేసింది.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *