ట్రస్మా ఆధ్వర్యంలో హుజూరాబాద్ లోని సాయిరూప గార్డెన్ లో గురుపూజోత్సవంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గోన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన హుజురాబాద్ ప్రైవేట్ టీచర్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామని హామీ ఇచ్చారు.
హరీష్ రావు కామెంట్స్:
సెప్టెంబర్ 5 అంటే అందరికీ గుర్తు వచ్చేది గురు పుజోత్సవం. తల్లి తండ్రుల తరువాత గౌరవం ఇచ్చేది గురువులకు మాత్రమే. మనల్ని ఈ స్థాయికి తీసుకొచవచ్చేది గురువులు మాత్రమే. ఒక ఉపాద్యుడిగా జీవితం ప్రారంభించి రాష్ట్రపతి స్థాయికి వెళ్ళారు సర్వేపల్లి రాధాకృష్ణన్,అబ్దుల్ కలాం గారు. గురు pujo. సందర్భం గా ఇంత మంది గురువులను సన్మానం చేస్ అవకాశం ఇచ్చిన వారందరికీ కృత్నతలు.
త్వరలో ఏ జిల్లాకు చెందిన వారిని ఆ జిల్లాకే 95 శాతం ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇస్తాం. ఇప్పటికే లక్షా 30ఉద్యోగాలు భర్తీ చేశాం. అరవై వెల ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయి. వాటిని రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా భర్తీ చేస్తాం. విద్య వ్యవస్థ పై ముఖ్యమంత్రి కేసీఅర్ దృష్టి పెడుతున్నారు.
రాబోయే రోజుల్లో హుజూరాబాద్ నియోజక వర్గం లో అర్హులైన ప్రైవేట్ ఉపాధ్యాయులకు డబుల్ బెడ్ రూం ఇల్లు.
ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల్లో ప్రైవేట్ టీచర్లు కు భాగస్వాములు చేస్తాం.
పాఠశాల లు ప్రారంభం అయినందున బ్యాంకులతో మాట్లాడి ప్రైవేట్ స్కూళ్లకు సహాయం అందేలా చూస్తం.
హుజూరాబాద్ లో విద్యార్థుల భవిష్యత్తు లో బాగు పడాలంటే టీఆరెఎస్ కు ఓటు వేయండి.
సెంటిమెంట్ కాదు హుజూరాబాద్ కు అభివృద్ది కావాలి.
న్యాయం ధర్మం విశ్లేషించి ధర్మం వైపు నిలబడండి.