డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చదివిన రేణిగుంట స్కూల్ ఇదే

ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. నాటి భారత రాష్ట్రపతి డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి.  ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ రోజు టీచర్స్ డే ప్రకటించారు.
ఎంతదూరపు యాత్ర అయినా  సరే ఒక అడుగుతోనే మొదలవుతుంది. ఎంత గొప్ప మేధావి అయినా సరే ఆయన జీవితంతో పాఠశాలతో మొదలవుతుంది. ప్రపంచంలో మేటి తాత్వికులలో ఒకరిగా గుర్తింపు పొంది, భారత దేశానికి రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాభ్యాసం కొద్ది రోజులు తిరుపతిలోని చిన్న స్కూలులో జరిగింది.
ఆ స్కూలు చరిత్ర ఇది..
డాక్టర్ సర్వే పల్లి రాధాకృష్ణన్ చదువుకున్న స్కూల్ కూడా క్రిష్టియన్ మిషనరీ స్కూలే. ఆస్కూలును ఆయన రాష్ట్రప్రతి అయ్యాక కూడా మర్చిపోలేదు. ఆయన మేధోజీవితానికి పునాది వేసింది ఈ క్రిష్టియన్ మిషనరీ స్కూలేనని ఆయన జీవితాంతం గుర్తుంచుకుని, ఉప రాష్ట్రపతిగా ఉన్నపుడు స్కూలు వార్షికోత్సవానికి కూడా హాజరయిన  విధేయుడు.
చిత్తూరు జిలా రేణిగుంటలోని  ఫీఫర్ మెమోరియల్ హైస్కూల్ ( Pfeiffer Memorial School).
రాష్ట్రంలో శతాబ్దం పూర్తి చేసుకున్నస్కూళ్లలో ఇదొకటి. తిరుపతి-చెన్నై హైవేకి దూరంగా ప్రశాంత వాతావరణంలో ఈ స్కూలు ఉంటుంది. ఈ స్కూలు నిజానికి మొదట తిరుపతిలో ఏర్పాటయింది. 1880లో  తిరుపతిలోని ఈస్టు మిషన్ కాంపౌండులో ఈ స్కూలు ఏర్పాటయింది. అపుడు జర్మనీ మిషనరీల అండ ఈ స్కూలుకు ఉండేది. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న మంచి పాఠశాల ఇదే.  అయితే, తర్వాత 1930లో దీనిని రేణిగుంటకు మార్చారు. రాధాకృష్ణన్ చదువుకున్నది తిరుపతిలో ఉన్నపుడే.

 

1955 డిసెంబర్ లో ఉపరాష్ట్రపతిగా ఉన్నపుడు పాఠశాల 75 వ వార్షికోత్సవానికి డాక్టర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు / pic: flickr
దాదాపు 120 సంవత్సరాలు పూర్తి  చేసుకుని, రాధాకృష్ణన్ వంటి మేధావిని అందించిన ఈ పాఠ శాలకు కూడా ఈకాలపు ప్రయివేటు చదువుల దెబ్బ తప్పలేదు.
ఇపుడీ స్కూలులో పిల్లలను చేర్పించేందుకు తల్లితండ్రులు అంతంగా ముందుకురావడం లేదని చెబుతారు. ఎయిడెడ్ స్కూలు కాబట్టి ప్రభుత్వ సాయం అందుతూ ఉంది. విద్యార్థులకుపుస్తకాలు, మధ్యాహ్నభోజనం అందుతున్నాయి.
ఒకపుడు  ఈ పాఠశాలకు మంచిపేరుండెది. అక్కడొక మంచి లైబ్రరీ కూడా ఉండేది. ఇపుడిదింతా చరిత్రమాత్రమే. ఇపుడు ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పడిపోతూ ఉంది. మంచిరోజుల్లో ఈ స్కూలు లో  వేయి మందిదాకా విద్యార్థులుడేవారు.ఇపుడు నూరు మంది మించరు.
1955 డిసెంబర్ 22న జరిగిన పాఠశాల 75వ వార్షికోత్సవ సభలో ప్రసంగిస్తున్న డాక్టర్ రాధాకృష్ణన్, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, అమెరికన్ లూథెరన్ చర్చ్ ప్రతినిధి డాక్టర హెన్రీ ష్కూహ్ కూడాఫోటోలో ఉన్నారు.
ఈ పాఠశాలను  ప్రధానిజవహర్ లాల్ నెహ్రూ సందర్శించారు.  1955 డిసెంబర్ 22న ఉప రాష్ట్రపతిగా ఉన్నపుడు డా. రాధాకృష్ణన్ కూడా సందర్శించి అక్కడ ఒక ఓపెన్ ఎయిర్ ధియోటర్ కు శంకు స్థాపన చేశారు.
Prime Minister Nehru addressing a gathering at PM School, Renigunta
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడి కూడా ఈ పాఠశాలలోనే చదివారు.

 

Like this story? Share it wit a friend!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *