దేశంలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. ఇందులో తెలంగాణ లోని హుజురాబాద్ ఉప ఎన్నిక లేదు.
పశ్చిమ బెంగాల్లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానం ఎన్నిలకు వెళ్తున్నాయి.
బెంగాల్లో భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలతో పాటు
ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి.
ఇందులో భవానీపూర్ నియోజకవర్గం ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నియోజకవర్గం.గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి బిజెపిచేతిలో ఓడిపోయారు. అందువల్ల అమె మళ్లీ పోటీ చేసి అసెంబ్లీకి గెలవాల్సి ఉంది. అందుకే భవానీ పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
సెప్టెంబర్ 30న పోలింగ్, అక్టోబర్ 3న కౌంటింగ్ఉంటుంది.
ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6విడుదలవుతుంది.
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 13అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
హుజురాబాద్ ఉప ఎన్నిక
హుజూరాబాద్ ఉప ఎన్నిక దసరా తర్వాతే కమిషన్ స్పష్టం చేసింది. పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని, అక్టోబర్ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉంతుందని పేర్కొంది. అలాగే ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నిక కూడా దసరా తర్వాతే ఉంతుందని తెలిపింది. ఈ మేరకు ఉప ఎన్నికను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కూడా కోరినట్లు వెల్లడించింది. .