ఒక్క ఉప ఎన్నికతో ఇంత అదృష్టమా, దేవుడా!

ఉప ఎన్నిక వస్తే ఇంత ప్రయోజనం ఉంటుందని హుజురాబాద్ ప్రజలు కలలో కూడా ఊహించి వుండరేమో. ఈ రోజు ఆర్థిక మంత్రి హరీష్ రావు నియోజక వర్గములో పేరుపేరునా ఏమేమి లేవో  గుర్తించి అవన్నీ చేస్తామని  చెబుతున్నారు. నియోజక వర్గం మీద  ప్రజల మీద ఉన్న అభిమానం ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది.

***

ఏడేళ్లు మంత్రిగా ఉన్న వ్యక్తి ఇక్కడ ఒక్క మహిళా సంఘ భవనం కూడా కట్టించలేదు.మా నియోజకవర్గంలో 20 మహిళా సంఘాలు కట్టించాను.

ప్రస్తుతం నాలుగు మహిళా సంఘ భవనాలు మంజూరు చేస్తున్నాం. అంతటా కట్టినా హుజురాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించ లేదని ఇక్కడి మహిళలు చెబుతున్నారు.కొంత సొంత స్థలాల్లో కట్టుకునేందుకు డబ్బులు కావాలంటున్నారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్, నేను మా దగ్గర… ఇండ్లు కట్టించి గృహ ప్రవేశం చేయించినా.. ఇక్కడ మాత్రం ఒక్కరికి కూడా గృహ ప్రవేశం కాలేదు. ఇది ఎవరి నిర్లక్ష్యం?

నేను ఇదే మాట అడిగితే… నన్ను తిడుతున్నారు. లేని పోని మాటలంటున్నారు. ఇది న్యాయమా?

అయ్యా..? ఏడేళ్లు మంత్రిగా ఉండి మీరు ఒక్క ఇల్లు కూడ కట్టలేదు, గృహప్రవేశం చేయించలేదని అడిగాను తప్పా?

ఆ బాధ్యత ఇప్పుడు నేను తీసుకుంటానని చెప్పాను తప్పా? ఇందులో ఏమన్నా బూతుపదాలున్నాయా.?

ఈ మాటంటే ఉలిక్కిపడుతున్నారు. నన్ను అనరాని మాటలంటున్నరు. నోటికొచ్చి తిట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఫించన్ల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదా? 200 నుంచి 2016కు ఫించన్లు పెంచాం.

50 వేలున్న కల్యాణ లక్ష్మి ఇప్పుడు లక్షకు పెంచలేదా?

కానీ కల్యాణ లక్ష్మి డబ్బులు పరిగె ఏరుకోవడమని, ఇది పనికిరాదని ఈటల రాజేందర్ అంటున్నారు?

పేదింటి తల్లికి తన బిడ్డ పెళ్లికి ఈ డబ్బులు ఎలా ఉపయోగపడుతాయో తెలుస్తుంది.

కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఆడపిల్ల పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు.

కులమతాలకు అతీతంగా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తోంది.

గతంలో పెళ్లికూతురు పేరిట చెక్కులు ఇవ్వడం వల్ల అత్తారికి ఆ డబ్బులు పోతున్నాయని తెలిసి.. ఇప్పుడు పెళ్ళికూతురు తల్లి పేరుతో ఇస్తున్నాం.

ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి కేసీఆర్ కిట్ పథకం కింద.. ఆడపిల్ల పుడితే 13 వేలు, మగపిల్లవాడు పుడితే 12 వేలు ఇస్తోంది సర్కారు.

హుజురాబాద్ పట్టణంలో ఏ గల్లీ చూసినా రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు. మెయిన్ రోడ్ కూడా సరిగ్గా లేకుంటే మేమే మొన్న వేయించాం.

సైదాపూర్-బోర్నపల్లి రోడ్డు అధ్వానంగా ఉంది. దీనికోసం 6 కోట్లు మంజూరు చేస్తున్నాం.

హుజురాబాద్ పట్టణ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే 35 కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించా.

13 కిలో మీటర్ల సీసీ రోడ్లు హుజురాబాద్ లో వేపిస్తున్నాం.

మిగిలిన పనుల కోసం గెల్లు శ్రీనివాస్ గెలిచాక ఎమ్మెల్యే ఫండ్స్ 5 కోట్లు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కి వచ్చే 5 కోట్లు ఖర్చు చేసుకుందాం.

రాబోయే రోజుల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తి చేసి నేనే రిబ్బన్ కట్ చేసి మిమ్మల్ని సొంత ఇళ్లకు పంపిస్తాం.

కొందరు బొట్టుబిల్లలు, కుట్టుమిషన్లు, గ్రైండర్లు ఇస్తున్నారట. కుంకుమ భరిణలు కొనుక్కొచ్చి పెట్టారట.

మీకు రూపాయి బొట్టు బిల్లలిచ్చేవారు కావాలా..? 2 వేల ఫించన్ ఇచ్చేవాళ్లు కావాలా?

60 రూపాయల గడియారం కావాలా? లక్ష రూపాయల కల్యాణ లక్ష్మి ఇచ్చేవాళ్లు కావాలా?

గడియారాలకు, బొట్టుబిల్లలకు మోసపోతారా?

గ్యాస్ సిలిండర్ వెయ్యి రూపాయలకు పెంచి, సబ్సిడీ మొత్తం తీసేసారట. అందుకే బీజేపీ వాళ్లకు ఓటువేయమని మహిళలు చెబుతున్నారు.

పెట్రోలు, డీజీల్, గ్యాస్, మంచినూనె ధరను పెంచారు. అలాంటోళ్లకు మళ్లీ ఇంకా ఓటేస్తారా?

సెంటిమెంట్ డైలాగులు కొట్టేవాళ్లు కాదు.. మనకు పనులు చేసేవాళ్లు, మన కష్టాలు తీర్చేవాళ్లు కావాలి.

మాటలు మస్తు మాట్లాడొచ్చు… కానీ చేతలు కావాలి. నోటి మాటలు కడుపు నింపవు.

టీఆర్ఎస్ పేదల ప్రభుత్వం.. ప్రజల కోసమే మేము పనిచేస్తాం.

కరోనాలాంటి కష్టకాలంలోనూ పది కిలోల బియ్యం, కంది పప్పు పంపిణీ చేసాం. రెండు నెలల పాటు 15 వందల రూపాయలు ఇచ్చాం.

కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం.

రాబోయే రోజుల్లో సొంత జాగాలో ఇళ్లు కట్టించే కార్యక్రమం అంతటా ప్రారంభిస్తాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *