వివిధ దేశాధినేతలకు ఆయా దేశాల్లో ఉన్న పలుకుబడికి సంబంధించి భారత ప్రధాన నరేంద్రమోదీ అగ్రస్థానంలో ఉన్నరు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ లు ఇద్దరు ఐదో స్థానంలో ఉన్నారు. ఈ విధంగా జనామోదంలో భారత ప్రధాని ప్రపంచాధినేతయే. ఏదేశాధినేత ఆయన దరిదాపుల్లో లేరు.
దేశాధినేతలకు తమ తమ దేశాల్లో ఉన్న పలుకుబడి మీద అమెరికా కు చెందిన డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్డ్ ’( Morning Consult) జరిపిన ఒక సర్వేలో వెల్లడయింది.
మెదీ తర్వాతి స్థానంలో మెక్సికన్ అధ్యక్షుడు యాండ్రెస్ మ్యాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్ ది.
ఆగస్టు 23న జరిపిన ఈ సర్వే ప్రకారం భారత దేశంలో రేటింగ్ లో కొంత తగ్గుదల కనిపించింది. ఆగస్టు 23న ఇది 72 శాతం ఉండింది. అయితే, జూన్ 23న రికార్డయిన 63శాతం అప్రూవల్ రేటింగ్ కంటే ఇది ఎక్కువ.
అమెరికా అధ్యకుడు బైడెన్, అస్ట్రేలియా అధ్యక్షుడు స్కాట్ మారిసన్ రేటింగ్ కేవలం 48 శాతమే. తర్వాతి స్థానంలో కెనడాప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడో (45శాతం) ఉన్నారు. ఇంగ్లండు ప్రధాని రేటింగ్ 41 శాతమే. వారంరోజులపాటు వయోజనుల అభిప్రాయాలను సేకరించి మార్నింగ్ కన్సల్డ్ ఈ ర్యాంక్ ఇస్తుంది. మొత్తం ఈ సంస్థ 13 దేశాధినేతల జనామోదం అంచనావేస్తూ ఉంటుంది.
మిగతాదేశాలకు సంబంధించి, బ్రెజీలియన్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో (39 శాతం), దక్షిణ కొరియా అధ్యక్షుడు మూడన్ జోఇన్ (38), స్పానిష్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ (35), ప్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మ్యాక్రాన్ ( 34)జపాన్ అధ్యక్షుడు యోషిహిడో సుగా (25)లు ఉన్నారు.