ఉపరితల ఆవర్తన ప్రభావంతో శని, ఆదివారాల్లో విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటినుంచి మోస్తరు వానలు కురుస్తాయి.
ఈ నెల 6న ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనమేర్పడే అవకాశం ఉంది.