ఎపి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసుల కొట్టివేత

అమరావతి : చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన  దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై ఇన్‍సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద జగన్ ప్రభుత్వం  పెట్టిన కేసులను అమరావతి హైకోర్టు కొట్టి వేసింది. అంతేకాదు,

అన్యాయంగా కేసులు పెట్టి తమను మానసిక వేదనకు గురిచేసినందుకు దమ్మాలపాటి శ్రీనివాస్  ప్రభుత్వం మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కూడా  ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

ఎఫ్‍ఐఆర్‍ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గతంలో  అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనిఫిర్యాదులురావడంతో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని నియమించింది. అయితే,దీని హైకోర్టు స్టే విధించింది. ఫిబ్రవరి 10, 2020 న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా సిట్ దర్యాప్తు  గురించి పరకటించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసుల మీద ED ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నదని, సిట్ ఇడికి సహకరిస్తుందని ఆయన చెప్పారు. తర్వాత పది రోజుల్లోనే అంటే ఫిబ్రవరి 21న  పది మంది సభ్యులతో సిట్ ఏర్పాటుచేశారు.అంతకు ముందుతెలుగు దేశంప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకల మీద వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించింది.  నాటి ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ తదిరులు, రాజధాని అమరావతి విషయం దాచిపెట్టి సుమారు 4 వేల ఎకరాల భూమి కొనుగోలు చేశినట్లు క్యాబినెట్ సబ్ కమిటి గుర్తించింది.

ఈ నివేదిక అధారంగా సిట్ విచారణ జరుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, ఆయన కుమారుడు నాటి ఐటి మంత్రి లోకేష్ నాయుడు లతో పాటు అడ్వకేట్ జనరల్ దమ్మాల పాటి శ్రీనివాస్ తదితరుల మీద సిట్ దర్యాప్తు గురిపెట్టింది. ఇంటెలిజెన్స్ డిఐజి కొల్లి రఘురామిరెడ్డి అనే 2006 బ్యాచ్ ఐపిఎస్ అధికారి  సిట్ కు నేతృత్వం వహించారు.

సిట్  దర్యాప్తు మీద హైకోర్టు  స్టే ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  సుప్రీంకోర్టుకు ను ఆశ్రయించి స్టే ఎత్తివేయాలని కోరింది. దానితో పాటు ఈ కేసుల మీద కోర్టు అధ్వర్యంలో సిబిఐ విచారణ జరిపినా రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదని తెలిపింది.

అయితే  కోర్టు జూలై19న హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేసిన ఆరు పిటిషన్లను కొట్టి వేసింది. ఈ పిటిషన్లన్ని ప్రైవేటు కొనుగోలు దారుల మీద వేసింది. రాజధాని ఇక్కడే వస్తున్నదనే నిజం వెల్లడించకుండా వీరు చవకగా భూములను కొని రైతులను మోసగించారనేది ఆరోపణ.  అయితే, తర్వాత సుప్రీంకోర్టులో వేసిన  పిటిషన్లను  ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.  తాము హైకోర్టునే ఆశ్రయిస్తామని తెలిపింది.

నెల రోజుల్లో కేసును తేల్చేయాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

జస్టిస్ మానవేంద్రనాథ్‍రాయ్ బెంచ్ ముందు ఇపుడు  ఈ కేసుల విచారణ జరిగింది. దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై కేసులను  హైకోర్టు కొట్టి వేసింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *