తిరుమల ‘సాంప్రదాయ భోజనం’ రద్దు

తిరుమల: తిరుమలలో సాంప్రదాయ భోజనం  మొత్తానికి రద్దయింది. దీనిని రద్దుచేస్తున్నట్లు టిటిడి చెయిర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. సాంప్రదాయ భోజనం  పేరుతో వ్యాపార క్యాంటీన్ మొదలు టిటిటి తిరుమలలో అనేకటీన్లు తెరవాలనుకుంది. లాభనష్టం లేకుండా  భక్తులకు శుచి,రుచికరమయిన భోజనం  పెట్టి చార్జ్ చేయాలనుకుని ఒక ప్రయోగం కూడా చేశారు.అది విజయవంతమయింది.

దానితో తిరుమలలో ఏడెనిమిది క్యాంటీన్లు కూడా తెరిచే ప్లాన్ ఉండింది. దీనిని బహిరంగంగా ప్రకటించారు కూడా. ఇలా  ఆ క్యాంటీన్లు బాగా నడిస్తే, భక్తులు ఎంతగానో మెచ్చుకుని భోజనం చేసి తరించామని భావించే నిత్యాన్న దానం (భోజనం ప్రసాదం) ఎత్తేస్తారేమోనని అనుమానాలు సర్వత్రా వ్యాపించాయి. అసంతృప్తి వ్యక్తమయింది. దీనిని మీద నిన్న టిటిడిఅధికారులు వివరణ ఇచ్చారు. అదంతా తప్పుడు ప్రచారమని ఖండించారు. అయితే, ఈరోజు ఈ  కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు  ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

‘‘పాలక మండలి లేనప్పుడు అధికారులు ఈ సాంప్రదాయిక భోజనం పథకం నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో భక్తులకుకేవలం  ‘ప్రసాదం’గా భోజనం అందించాలి. అన్నప్రసాదానికి భక్తుల నుంచి నగదు తీసుకోకూడదు. సంప్రదాయ భోజన విధానం తక్షణమే నిలిపివేస్తున్నాం. సర్వదర్శనం అమలుపై అధికారులతో చర్చిస్తాం. అధికారుల హామీ మేరకు వీలైనంత మందికి ఉచిత దర్శనం కల్పిస్తాం’’ అని సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సాంప్రదాయ భోజనంపథకం రద్దు అని ప్రకటించినందుకు తిరుపతి, తిరుమల పవిత్రత కాపాడటం  కోసం ఎపుడూ పోరాడే యాక్టివిస్టు నవీన్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

నవీన్ కుమార్ రెడ్డి

టీటీడీ అధికారుల తొందరపాటు నిర్ణయం పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతూ టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి “అన్న ప్రసాదం”కు డబ్బులు తీసుకోకూడదు అని ప్రకటించడం దైవానుగ్రహం అని ఆయన వ్యాఖ్యానించారు.

టిటిడి ప్రతిష్టకు భంగం కలిగేలా శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపడేలా నిర్ణయాలు తీసుకుంటున్న అధికారులపై శ్రీవారి భక్తులు “కేసులు” ఎందుకు పెట్టే విషయం ఆలోచించాలని ఆయన కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *