అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన పీఏసీ సమావేశంలో తెలంగాణలో నత్తనడక నడుస్తున్న అనేక నీటిపారుదల ప్రాజక్టుల మీద ప్రభుత్వ అధికారులను నిలదీసిన మాజీ మంత్రి, కాంగ్రెస్ మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అధికారులను ప్రశ్నించారు. కాళేశ్వరం మీద చూపిస్తున్న శ్రద్ధ ఇతర ప్రాజక్టుల మీద చూపకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆయన వేసిన ప్రశ్నలివే:
* కాళేశ్వర్ ప్రాజెక్టు తరహాలో అంతే పండగలాగా, వేగంగా అట్టహాసంగా మిగతా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడంలేదు?
* AIBP కింద SRSP సెకండ్ ఫేజ్, దేవాదుల, వరద కాలువ పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు?
* 2019లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ప్రాజక్టులను కూడా ఎందుకు చేయలేదు? – శ్రీధర్ బాబు.
* మంథని లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తామని పదే పదే చెప్తున్నా పనులు ఎందుకు ముందుకు సాగడం లేదు?
* రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఏపీ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోని పనులు చేస్తున్నా తెలంగాణ ఎందుకు నిర్లక్ష్యం చేసింది?
సమావేశానికి PAC చైర్మన్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షత వహించారు. హాజరైన వారిలో, సభ్యులు శ్రీధర్ బాబు- రవీంద్ర నాయక్- విఠల్ రెడ్డి- జాఫ్రీ అధికారులు ఉన్నారు.