“కృష్ణానదీ యాజమాన్య బోర్డు నోటిఫికేషన్.. నేపథ్యంలో రాయలసీమ ప్రాజక్టుల భవితవ్యం” పై 28 ఆగష్టు 28 న అనంతపురం ప్రెస్ క్లబ్ లో ‘రాయలసీమ వాటర్ ఫోరం’ ఆధ్వర్యంలో సమాలోచన జరిగింది.అందులో పలు తీర్మానాలు ఆమోదించడమైంది.
తీర్మానాలు
హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, వెలుగొండ ప్రాజెక్ట్ లను అనుమతులు పొందిన ప్రాజక్టులుగా కె.ఆర్.యం.బి నోటిఫికేషన్ లో సవరణలు చేయాలి.
పార్లమెంటులో ఆమోదం పొందిన రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న పై నాలుగు ప్రాజక్టులను పూర్తి చేసి, నికరజలాల కేటాయింపుల కోసం కార్యాచరణ చేపట్టాలి.
రాష్ట్ర విభజన కంటే ముందే అంతర్గత సర్దుబాడులతో నిర్మాణం చేసిన ముచ్చుమర్రి, గురురాఘవేంద్ర, సిద్దాపురం లిప్ట్ లను అనుమంతించిన ప్రాజక్టు లుగా కె.ఆర్.యం.బి లో చేర్చాలి.
తుంగభద్ర హైలెవల్ సమాంతర కాలువ, వేదవతి, గుండ్రేవుల, సిద్దేశ్వరం అలుగు ప్రాజక్టులను నిర్మాణం చేపట్టాలి.
రాయలసీమ హెచ్.యల్.సి, యల్.యల్.సి, కె.సి కెనాల్ లకు కేటాయించిన నికరజలాలను సాగునీటికి పూర్తిగా వినియోగించి, తాగునీటికి, పరిశ్రమలకు ప్రత్యేకంగా నీటిని కేటాయించాలి.
తెలంగా రాష్ట్రం ఏర్పడే సందర్భంలో పొలవరం ప్రాజక్టుకు పూర్తి సమ్మతిని చట్టంలో పేర్కొన్నారు. ఈ ప్రాజక్టు ద్వారా ఆదా అయ్యే నీటిని అడ్డంకులు లేకుండా నిర్మాణంలో ఉన్న సీమ ప్రాజక్టులకు కేటాయించాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రాజక్టుల కు బచావత్ అవార్డు కేటాయించిన 512 టి.యం.సీలలో అంతర్గత సర్దుబాటుల ద్వారా వెనుకబడిన ప్రాంత ప్రాజక్టులకు అదనంగా కేటాయించాలి.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేంద్రాన్ని కర్నూలు లో ఏర్పాటు చేయాలి.
సంప్రదాయ సాగునీటి వనరుల సంరక్షణ కోసం ప్రత్యేక సాగునీటి కమీషన్ ఏర్పాటు చేయాలి.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజిని సమగ్రంగా అమలు చేసి జీవావరణ, పర్యావరణాన్ని కాపాడాలి.