హుస్సేన్ సాగర్ కుంచించుకు పోతున్నది. హైదరాబాద్ కిరీటంలో వజ్రంలాగా మెరిసే హుసేన్ సాగర్ ను అటునుంచి పూడ్చు కొస్తున్నారు. చాలా తెలివిగా ఈ పనిజరుగుతూ ఉంది. హుస్సేన్ సాగర్ సుందీకరణ కోసం ద్వీపాలను నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమాలతో హుసేన్ లేక్ నీటి నిలువ సామర్థ్యం పడిపోతుంది. అపుడు భూమి బయపడుతుంది. దీనిని వెంటనే కన్ స్ట్రక్షన్ వేస్టుతో నింపేస్తున్నారు, అపుడు పెద్ద వాళ్ల చేతుల్లోకి ఈ భూమి వెళిపోతుంది. ఈవిషయాలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువచ్చారు. ఇపుడు సర్కార్ రిపేర్ పేరుతో ఒక సర్ ప్లస్ అలుగు (weir) ఎత్తు తగ్గించడమో, పడగొట్టడమో జరుగుతూ ఉంది. హుస్సేన్ సాగర్ నిల్వ ఉన్న నీటిని తగ్గిస్తూ పోవడమంటే ఏమిటి సాగర్ పరిద్ధి కుంచించుకుపోతుంది. నేల బయటపడుతుంది. నెలబయటపడితే అక్కడ ఏవో ఒక నిర్మాణాలు చేపట్టేందుకు దురాక్రమణ జరుగుతుంది. విశాలమయిన సరస్సు చివరకు చిన్న కుంటగా మారిపోతుందేమోననే అందోళన కలుగుతుంది.
ఇది రాజకీయ పార్టీల ఆరోపణ కాదు, శటిలైట్ కళ్లారా చూసిచెప్పిన నిజం. హుస్సేన్ సాగర్ నాలాలను పూడుస్తున్న శటిలైట్ చిత్రాలను నగరానికి చెందిన లేక్ ప్రొటెక్షన్ యాక్టివిస్టు డాక్టర్ లూబ్నా సార్వత్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సమర్పిస్తూ లేక్ దురక్రమణను ఆపాలని పిటిషన్ వేశారు.
పాతసెక్రెటేరియట్ భవనాలు కూల్చగా వచ్చిన వ్యర్థంతో హుసేన్ సాగకు చెందిన హుస్సేన్ సాగర్ను పూడ్చేందుకు వాడుతున్నారు. హుసేన్ సాగర్ అదనపు అలుగు (Weir)ను రిపేర్ చేయాలనే పేరుతో హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ మార్చేస్తున్నారని, దీనివల్ల లేక్ అడుగు బయటపడగానే సెకట్రేరియట్ కూల్చివేసినపుడు వచ్చిన వ్యర్థాన్ని నింపుతున్నారని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. కూకట్ నాలా ని పూడ్చేస్తున్నారని చెబుతూ ఆమె శటిలైట్ ఫోటోలను సమర్పించారు.
ఇదే విధంగా ఫుల్ ట్యాంక్ లెవెల్ ద్వీపాలను నిర్మిస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. దీనికి స్పందిస్తూ ఇదంగా అబద్దమని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. అయితే, శటిలైట్ ఫోటోల మీద మాత్రం మౌనం వహించింది.
సెక్రటెరియట్ కూల్చేసినపుడు వచ్చిన1.4 లక్షలటన్నుల వ్యర్థాన్ని జీడిమెట్ల ప్రాసెసింగ్ ప్లాంటుకు పంపిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఒక అదనపు అలుగు సాయంతో హుస్సేన్ సాగర్ నుంచి నాన్ ఫ్లడ్ వాటర్ ను బయటకు తరలించడం జరుగుతూ ఉందని, దీనితో సరస్సుకు ముప్పు వస్తుందని డాక్టర్ లూబ్నా తన పిటిషన్ లో పేర్కొన్నారు.
“The illegal actions of the respondents reveal that dismantling and lowering the weir is done to allow non-flood waters in order to expose the shallow parts of lake upstream which is already seized with heavy pollutant deposits in the lake… The Geotagged pictorial documentation of non-flood waters are flowing out of Hussain Sagar in spite of FTL of lake being below the FTL mark of 513.41M. Lowering of the weir below the FTL height of the Hussain Sagar Lake is to permanently change the FTL height of the lake. A thorough probe is necessary to look into the manipulations being done with the very existence of the lake, the height difference in the FTL and weir and the dismantling of the weirs.” అని లూబ్నాపిటిషన్ లో పేర్కొన్నారు.
హుస్సేన్ సాగర్ ని నీటి మట్టం తగ్గించే ప్రయత్నం
నిజానికి హుస్సేన్ సాగర్ లో నీళ్లు పుల్ ట్యాంక్ లెవెల్ లోపే ఉన్నపుడు నీటిని ఎవరూ బయటకు వదలరు. లబ్నా రెండో ఫోటోలను ట్రిబ్యునల్ కు సమర్పించారు. ఇందులో ఒకటి (ఎడమ) 12.06.2021 న తీసినది. రెండోది (కుడి) 30.06.2019 న తీసినది.బాగా గమనించండి
రెండు ఫోటోలో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) 513.41 మీటర్ల కంటే తక్కువగానే ఉంది. అయినా సర్వే అదనపు అలుగు నుంచి సాగర్ నీరు బయటకు దూకుతూనే ఉంది. దీన్థర్థం ఏమిటి? సాగర్ నీటి వైశాల్యాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతుందని అనుమానించాల్సి వస్తున్నదా లేదా?
The weir should be restored to its original height immediately. A thorough shortest time-bound probe with full accountability into the tampering of the FTL height due to lowering of the weir, which threatens the very existence of the lake itself, should be ordered.
అందువల్ల ఆ సర్ ప్టస్ అలుగును వెంటనే ముందున్నస్ధాయికి పెంచాలే ప్రభుత్వానికి ఆదేశించాలని ఆమె కోరారు. అలుగు ఎత్తు తగ్గించి, హుస్సేన్ సాగర్ నుంచి నీటిని బయటకు పంపి FTL తగ్గిపోయేలా చేసేందుకు కారణమెమవరో వెంటనే దర్యాప్తు జరిపి వారి చర్య తీసుకోవాలని కూడా ఆమె కోరారు.