KCR సరికొత్త రికార్డు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంక్షేమ పథకం  అమలులో రికార్డ్ నెలకొల్పారు. ఒక వర్గానికి, అందునా ఓకె ఒక నియోజక వర్గానికి రూ. 2000 కోట్లు విడుదల చదయడం ఎపుడు ఎక్కడ జరిగి ఉండదేమో. ఆ ఘనత దళిత బంధు పతాకానికి దక్కింది.కేసీఆర్ సరిగ్గా 10 రోజుల్లో ఈ పథకానికి రూ.2000 కోట్లు విడుదల చేసారు. సెప్టెంబర్ లో అసెంబ్లీ ఉప ఎన్నిక్షకు పోతున్నపుడు ఒక్కొక్క దలిత కుటుంబానికి రూ. పది లక్షలు అందిస్తారు. ఎన్నికల ముందు లబ్ధిదారులు ఎగిరి గంతేయకుండా ఉంటారా?

దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది.

దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం ఈ నెల 16న  హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో ఇటీవల సిఎం కెసిఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం , నేడు విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది.

పైలట్ ప్రాజెక్టును  చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకున్నది.

సిఎం కెసిఆర్ ఆదేశాలతో పూర్తి నిధులు  విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ సిఎం కెసిఆర్ ఆకాంక్షల మేరకు అమలు చేయడమే మిగిలింది.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు, దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కోసం నిధుల విడుదల వివరాలు:
*తేదీ 9.8.21 నాడు రూ. 500కోట్లు
*23.08.2021 నాడు రూ. 500 కోట్లు
*24.08.2021 నాడు రూ. 200 కోట్లు
*25.08.2021 నాడు రూ. 300 కోట్లు
*26.08.2021 (నేడు) రూ. *500  కోట్లు
*మొత్తం:  రూ. 2000 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *