అక్టోబర్ లో కోవిడ్ థర్ధ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని, అప్రమత్తం కావాలని నేషనల్ ఇన్ స్టిట్యూట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (NIMD) హెచ్చరించింది. కేంద్ర హోం శాఖ ఆద్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఈ సంస్థ ప్రధాన మంత్రి కార్యాలయా (PMO)నికి థర్డ్ వేవ్ పరిస్థితుల మీద ఒక నివేదిక సమర్పించింది.
థర్డ్ వేవ్ ముప్పుపొంచి ఉన్నందున, పెద్ద సంఖ్యలో చిన్న పిల్లలో కోవిడ్ కు గురయితే, వారికి చికిత్స చేసేందుకు దేశంలో చిన్న పిల్లల వైద్య వ్యవస్థను పటిష్టం చేయాలని ఈ సంస్థ కోరింది.
అయితే, దేశంలో చిన్న పిల్లల వైద్య చికిత్స్ పటిష్టంగా ఉందా? ఈ చిన్న పిల్లల వైద్యం మీద దేశం ఎపుడూ శ్రద్ధ పెట్ట లేదు. ఇపుడు కోవిడ్ ధర్డ్ వేవ్ చిన్న పిల్లలకు సోకితే, పరిస్థితి ఎలా ఉంటుందో నని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
కోవిడ్ మొదటి రెండు ఉప్పెన ల్లాగా థర్ధ వేవ్ పిల్లల దాడి చేస్తే తట్టుకునే విధంగా పిల్లల వైద్య సదుపాయాలు లేవని ఈ సంస్థ అభిప్రాయపడింది.మూడో వేవ్ కచ్చితంగా పిల్లలకే వస్తుందని చెప్ప లేకపోయినా, 18 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ జరగలేదు కాబట్టి, వారికి కోవిడ్ సోకేప్రమాదం ఉందని ఈ సంస్థ పేరొంది.
చిన్న పిల్లలకు సోకితే చాలా సమస్యలున్నాయి. ఆసుపత్రిలో చేరిన చిన్నపిల్లవాడికి తోడుగా తల్లిదండ్రుల్లో ఒకరుండాలి. అపుడు వాళ్లకి పిపిఇ కిట్ ఉండాలి. అంతేకాదు, ఆసుపత్రుల్లో వాళ్ళకి భోజన వసతి కల్పించాలి. చిన్న పిల్లలకు ట్రీట్ ఇవ్వడంలో ఆసుపత్రి సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి.
కోవిడ్ థర్డ్ వేవ్ వస్తేగాని,మన చిన్న పిల్లల ఆరోగ్య వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో తెలియదు.