టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా?

ఆవిర్భావం నుంచి టిడిపి కొనసాగుతున్న తూర్పుగోదావరి జిల్లా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేసినట్లు వార్త. పార్టీలో తగిన గుర్తింపు లేకపోవటం పైన మనస్థాపంతో ఉన్నారు. అధినేతతో మాట్లాడటం కూడా మానేశారు. ఆరు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేపో మాపో అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తారని తెలిసింది.

ఈ విషయం ప్రస్తావించినపుడు,  రాజీనామాపై నిర్ణయాన్ని త్వరలో బహిరంగంగానే చెబుతానని ఆయన అన్నారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నిర్వహణలోనే లోపాలు ఉన్నాయని,తాను  చంద్రబాబును కలవనని చెబుతూ పార్టీ నేతలు కలుస్తారని పార్టీలో ప్రస్తుతం నేను ఒంటరివాడినని వ్యాఖ్యానించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *