నాటి మేటి ఫోటో…. మనిషి తొలి ఫోటోగ్రాఫ్ ఇదే…

ఇది విశ్వవిఖ్యాత చాయాచిత్రం. ఒక విధంగా చెబితే ఆధునిక ఫోటో గ్రఫీని ఉపయోగించి తీసిన ఫోటో. దీనిని తీసిన వ్యక్తి లూయిస్ డాగ్యూ (Louis Daguerre) .1839లో దీనిని తీసినట్లు. తాను రూపొందించిన కొత్త విధానం (Dagurreotype)లో డాగ్యూ (నవంబర్ 18,1787-జూలై 10,1851) ఈ ఫోటో తీశాడు. ఇది పారిస్ లోని ఎపుడూ రద్దీగా ఉండే ‘బుల్ వార్డ్ డు టెంపుల్’ లో తీశారు. ఆశ్చర్యం, ఈ వీధి నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడో అడుగన ఒక చోట్ల ఒక మనిషి షూ షైన్ చేయించుకుంటున్నారు. ఆయనతో పాటు బూట్ పాలిష్ చేస్తున్న వ్యక్తి తప్ప మరొకరెవరూ ఈ ఫోటోలో లేరు. ఈ రద్దీఅయిన పారిస్ వీధిలో మనుషులు, వాహానాలు ఏమయ్యాయి?

కదులుతున్నవస్తువును క్యాప్చర్ చేసే శక్తి డాగ్యూ టెక్నిక్ లేదు. ఈ ఫోటో తీస్తున్న సమయంలో నిలకడగా ఉన్నది కేవలం వీరిద్దరే. అందుకే వాహనాలు, నడస్తున్న మనుషులు ఎవరూ ఫోటోకెక్కలేదు.

Louis-Jacques Daguerre

కాకపోతే, ఈ ఫోటోలో అద్భుతమయిన క్లారిటీ ఉంది. నిలకడగా ఉండే వస్తువులన్నీ, అంటే భవనాలు, కటికీల అద్దాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అంతుకుముందున్న ఫోటో గ్రఫీ టెక్నిక్ లో ఇవంత స్పష్టంగా వచ్చేవికాదు. అసలు మనుషులు కన్పించేవి కారు. అందుకే డాగ్వూ తీసిన ఈ చిత్రం మనిషి తొలి ఫోటో గ్రాఫ్ అని చెబుతారు.

ప్రపంచంలో తొలి ఫోటో 1822లో వచ్చింది. డాగ్యూ మాంచి నాటకల స్టేజీ డిజైనర్. ఆయన ఫోటోగ్రఫీ కనిపెట్టిన  జోసెఫ్ నీసిఫోర్ నీప్స్ (Joseph Nicéphore Niépce ) సహాయకుడిగా కుదిరి ఫోటోగ్రఫీ టెక్నిక్ నేర్చుకున్నారు. నీప్స్ టెక్నిక్ ను ఇంప్రూవ్ చేసి తన విధానం రూపొందించి పోటోలు తీశారు. మరొక 20 సంవ్సరాలు ఆయన విధానంలోనే ఫోటోలు తీస్తూ వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *