ఇది విశ్వవిఖ్యాత చాయాచిత్రం. ఒక విధంగా చెబితే ఆధునిక ఫోటో గ్రఫీని ఉపయోగించి తీసిన ఫోటో. దీనిని తీసిన వ్యక్తి లూయిస్ డాగ్యూ (Louis Daguerre) .1839లో దీనిని తీసినట్లు. తాను రూపొందించిన కొత్త విధానం (Dagurreotype)లో డాగ్యూ (నవంబర్ 18,1787-జూలై 10,1851) ఈ ఫోటో తీశాడు. ఇది పారిస్ లోని ఎపుడూ రద్దీగా ఉండే ‘బుల్ వార్డ్ డు టెంపుల్’ లో తీశారు. ఆశ్చర్యం, ఈ వీధి నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడో అడుగన ఒక చోట్ల ఒక మనిషి షూ షైన్ చేయించుకుంటున్నారు. ఆయనతో పాటు బూట్ పాలిష్ చేస్తున్న వ్యక్తి తప్ప మరొకరెవరూ ఈ ఫోటోలో లేరు. ఈ రద్దీఅయిన పారిస్ వీధిలో మనుషులు, వాహానాలు ఏమయ్యాయి?
కదులుతున్నవస్తువును క్యాప్చర్ చేసే శక్తి డాగ్యూ టెక్నిక్ లేదు. ఈ ఫోటో తీస్తున్న సమయంలో నిలకడగా ఉన్నది కేవలం వీరిద్దరే. అందుకే వాహనాలు, నడస్తున్న మనుషులు ఎవరూ ఫోటోకెక్కలేదు.
కాకపోతే, ఈ ఫోటోలో అద్భుతమయిన క్లారిటీ ఉంది. నిలకడగా ఉండే వస్తువులన్నీ, అంటే భవనాలు, కటికీల అద్దాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అంతుకుముందున్న ఫోటో గ్రఫీ టెక్నిక్ లో ఇవంత స్పష్టంగా వచ్చేవికాదు. అసలు మనుషులు కన్పించేవి కారు. అందుకే డాగ్వూ తీసిన ఈ చిత్రం మనిషి తొలి ఫోటో గ్రాఫ్ అని చెబుతారు.
ప్రపంచంలో తొలి ఫోటో 1822లో వచ్చింది. డాగ్యూ మాంచి నాటకల స్టేజీ డిజైనర్. ఆయన ఫోటోగ్రఫీ కనిపెట్టిన జోసెఫ్ నీసిఫోర్ నీప్స్ (Joseph Nicéphore Niépce ) సహాయకుడిగా కుదిరి ఫోటోగ్రఫీ టెక్నిక్ నేర్చుకున్నారు. నీప్స్ టెక్నిక్ ను ఇంప్రూవ్ చేసి తన విధానం రూపొందించి పోటోలు తీశారు. మరొక 20 సంవ్సరాలు ఆయన విధానంలోనే ఫోటోలు తీస్తూ వచ్చారు.