ఒక రాష్ట్రాన్ని కొల్లగొట్టడం ఇంత ఈజీయా!

దేశాన్ని కొల్ల గొట్టారని అంటుంటారు. ఎపుడో ఈస్టిండియా కంపెనీవాళ్లు ఇలా చేశారని చాలా మంది దేశభక్తితో వూగిపోతుంటారు.

అలాంటిదే అక్షరాల  ఆంధ్రలో జరిగింది.

రాష్ట్రాన్ని అక్షరాలా కొల్లగొట్టారు. సోషల్  మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న ట్వీట్ వచ్చినా, దాన్నెవరైనా లైక్ చేసినా,షేర్ చేసినా భూతద్దంతో వెదికి పట్టుకుని కేసులు  పెట్టేంత సమర్థవంతులయిన పోలీసులన్న రాష్ట్రంలో ఆంధ్ర జాతి సంపద కొల్లగొట్టారు.

తూర్పుగోదావరి, విశాఖ పట్టణం జిల్లాలలో లక్షల టన్నుల లేటరైట్ (Laterite) అక్రమంగా తవ్వకుని ఖనిజం దోచుకుని వెళ్లిపోయారు. ఇంత ఖనిజం దోచుకుపోవడం అనేది గుట్టుగా జరిగే వ్యవహారం కాదు. అదేదో జేబులోనో,సూట్ కేసులోనో పెట్టుకుని తరలించేది కాదు. ఇంత భారీగా ఖనిజం తవ్వుకోవాలంటే యంత్రాలు అవసరం. ఖనిజాన్ని తరలించాలంటే వందల వేల సార్లు ట్రక్కులు తిరగాలి. పోనీ అవి గాలిలో ఎగురుతాయా అంటే అదీ  కాదు, పోనీ రాడార్లకు కనిపించకుండా తిరిగే స్టెల్త్ బాంబర్ వంటి విమానాలు కాదు.

ప్రభుత్వం వేసిన రోడ్లమీద, వూర్ల మీద పోలీస్ స్టేషన్ల పక్కనుంచే ట్రక్కుల్లోనే తరలించుకుని వెళ్లాలి.  ఈ మధ్యలో ఫారెస్టు వాళ్లున్నారు, మైనింగ్ వాళ్లున్నారు, పోలీసులున్నారు, రెవిన్యూ వాళ్లున్నారు. అయినా సరే కొన్ని లక్షల టన్నలు అమూల్యమయిన ఖనిజం తవ్వుకుని పారిపోయారు. సాధారణంగా ఇలాంటి సినిమాలలోనే సాధ్యం. ఆ తర్వాత ఇటీవల ఆంధ్రాలో చూస్తూన్నాం. ఇంత ఖనిజాన్ని దోచుకుపోయిన చావు కబురుని చల్లగా చెపిందెవరో అపోజిషన్ నాయకులు కాదు, ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఆయన ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ. ఖనిజాల రక్షణ భాద్యత ఆయనదే. ఖనిజాలను ఎవరైనా అక్రమంగా కొల్లగొట్టుకుపోతే, మొదటి బాధ్యత ఆయనదే.

అయితే, ఆయనే విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రని కొల్లగొట్టుకుపోయిన విషయం విలేకరుల సమావేశంలో అంగీకరించారు.

అయితే, ఇదంతా గత ప్రభుత్వం హాయంలో జరిందని, ఇపుడు జరగలేదని, అసలు ఇపుడు బాక్సైట్‌ తవ్వకాలు జరగనే లేదనే విషయాన్ని బాగా నొక్కి చెప్పారు.

2019 కి ముందే ఇంతగా ఖనిజాన్ని కొల్టగొట్టుకుపోతుంటే, గనుల శాఖ ఇపుడే ఎలా మేల్కొనింది. ఎందుకు ఇంత జాప్యం జరిగింది. ఎపుడు విచారణ ఆదేశించారు. ఎంత మందిని నేరస్థులుగా తేల్చారు. ఇలాంటి వివరాలేవీ ఆయన చెప్పలేదు. చెప్పిందంతా ఒక్కటే చిలక పలుకు, విచారణ పూర్తికాగానే, నేరస్థులెవరైనా చర్యలు తీసుకుంటాం… అని

గోపాలకృష్ణ ద్వివేది ఇంకా ఏమన్నారంటే…

“ తూర్పు గోదావరి, విశాఖ పట్నం జిల్లాల్లో అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టాం. ఇందుకుబాధ్యలైన వారిపై చర్యలు తీసుకుంటాం. విచారణ పూర్తి అయిన అనంతరం  సంబంధిత కంపెనీ మీద తగ్గు చర్యలు తీసుకుంటాం. తప్పు ఎవరు చేసినా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఈ కంపెనీతో మైనింగ్ శాఖ ఉద్యోగులు లాలూచి పడినట్లు విచారణలో తేలితే  అంటువంటి వారిపై చర్యలు తీసుకుంటాం. తూర్పుగోదావరి, విశాఖ పట్నం జిల్లాల్లో ఆండ్రూ మినరల్స్ కంపెనీకి 2013లో  8 లీజులు మంజూరుచేశారు. ఈ కంపెనీ మీద ఫిర్యాదులు అందిన తర్వాత గునుల శాఖ స్పందించి మొత్తం లీజులపైన విచారణ చేపట్టింది. ఇందులకుసంబంధించి విజిలెన్స్ బృందాలు ఏర్పాటుతోపాటు ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘన మీద కూడా విచారణ చేపట్టాము. 2లక్షల టన్నలు లేటరైట్ 1 అ క్రమ తవ్వకాలు జరిగాయని ప్రాథమిక విచారణలో తేలింది. భద్రతా చర్యలు, ఇతర ప్రమాణాలను కూడ తనిఖీ చేస్తున్నాము. గతంలో జరిగిన ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాము. గతంలో పనిచేసిన అధికారుల పాత్ర కూడా ఉంది. వారి పై కూడా తగు చర్యలు తీసుకుంటాం.” అని గోపాల కృష్ణ తెలిపారు.

ఇక గనుల శాఖ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి చెప్పిన వివరాలు : వేదాంతకంపెనీకి 34 లక్షల టన్నుల లేటరైట్ సరఫరా చేశారు. మరొక 4.5 లక్షల టన్నుల ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేశారున వీళ్లు లైటరైటే తవ్వరా లేక బాక్సైట్ కూడా తవ్వారా అనేదాని మీద కూడావిచారణ చేస్తున్నారు. 2013-19 మధ్య అండ్రూ మినరల్స్ కంపెనీ చేసిన తవ్వకాల మీద విచారణ చేస్తున్నాము.

చంద్రబాబు హయాంలోనే అక్రమ మైనింగ్’

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని,  దానివల్ల రూ.230 కోట్లకుపైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని అన్నారు. ఆండ్రూస్‌ మైనింగ్ సంస్థ అక్రమ మైనింగ్ చేసినట్లు ప్రాథమిక నిర్ధారణ అయిందని టీడీపీ నేతలతో ఆండ్రూస్‌ మైనింగ్ సంస్థకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.  ఇప్పటికే ఆండ్రూస్‌ మైనింగ్‌ సంస్థకు రూ.12.5 కోట్ల జరిమానా విధించినట్లు కూడా ఆయన చెప్పారు.  మైనింగ్ జరిగిన డ్రోన్ ద్వారా సర్వే మొదలుపెట్టామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *