2025 లోపు తెలంగాణ రాష్ట్రాన్ని మలేరియా రహిత రాష్ట్రంగా అవ్వబోతోందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే, ట్రైబెల్ ఏరియాల్లో మలేరియా వ్యాప్తి ఎక్కువగా ఉందని గతంతో పోల్చితే ఈ ఏడాది కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా అప్రమత్తంగా ఉండాలని అయన చెప్పారు.ప్రజలు గూగుల్- యూట్యూబ్ వైద్యంను నమ్మొద్దని ఆయన హెచ్చరించారు.
తెలంగాణలో మలేరియా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. గత రెండేళ్లుగా లక్షజనాభాకు కేవలం 5 కేసులు మాత్రం కనిపిస్తున్నాయి. 2017 నుంచి మలేరియా మరణాలు తెలంగాణలో లేవు. అందువల్ల వెక్టర్ కంట్రోల్ ప్రోగ్రాం తో దోమల నిర్మూలన కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అందుకే రాష్ట్రం 2025లో పు మలేరియా లేని రాష్ట్రం కానుంది.
2017లో 2,688 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇవి2019లో 1,709కి పడిపోయాయి. 2020 లో కేవలం 872 కేసులు మాత్రమే కనిపించాయి. 2021లో ఇంతవరకు 240 మలేరియా కేసులు మాత్రమే నమోదయ్యాయి.
“పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో శానిటేషన్ డ్రైవ్ ను పెద్ద ఎత్తున చేపడుతున్నందున మలేరియా నిర్మూలన సాధ్యమవుతున్నది,’ అని శ్రీనివాసరావు తెలిపారు.
కోవిడ్ ,మలేరియా లకు ఒకే రకమయిన రోగలక్షణాలుంటాయి. పాండెమిక్ కాలంలో జిహెచ్ ఎంసి అధికారులు చేపట్టిన కోవిడ్ నివారణచర్యలు రెండురకాలు గా పనిచేశాయి. అవి మలేరియా నిర్మూలనకు కూడా ఉపయోగపడ్డాయి, అని ఆయన చెప్పారు.
అయన ఇంకా ఏమన్నారంటే….
*థర్డ్ వేవ్ గురించి దేశంలో ఏ రాష్ట్రం ప్రిపేర్ కాలేదు- తెలంగాణ ప్రిపేర్ గా ఉంది. డెల్టా వేరియంట్ ను దేశం దాటేసింది.*
* రాష్ట్రం లో 1కోటి 65లక్షలకు వ్యాక్సిన్ వేశాము.*
*56శాతం వ్యాక్సిన్ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది*
*జిహెసెంసి పరిధిలో ఫస్ట్ డోస్ వంద శాతం పూర్తి అయింది*
*12లక్షల వ్యాక్సిన్ డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి.
*రాబోయే రోజుల్లో ఇంటింటికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము.
*డెల్టా వేరియంట్ అనేది ఒక్కటే ఉంటది- అందులో కొన్ని మార్పులు మాత్రమే జరుగుతాయి.
*విద్యా సంస్థలు తెరిచేందుకు మేము నివేదిక ఇచ్చాము.
*టీచర్లకు ఇప్పటికే వ్యాక్సిన్ ఇచ్చాము.
*వ్యాక్సిన్ వేసుకోవాలి- లేదంటే జనసంద్రంగా ఉండే ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉండదు.