వంట గ్యాస్ ధరల పచ్చినిజాలు, ఈ ఏడాది మొత్తం రు. 165 పెరిగింది

రెగ్యులర్ సబ్సిడీ సిలిండర్ ల ధరలు పెంచి,  ప్రధాని మోదీ ప్రభుత్వం సబ్సడి సిలిండర్ ధరకు,సబ్సిడీ లేని సిలిండర్ ధరకు తేడా లేకుండా చేసింది. మీకు తెలియకుండానే మీ అకౌంట్లలో పడుతూ వచ్చిన వంట గ్యాస్ సబ్సిడీ మొత్తం ఆగిపోయింది. ఈ విషయం ఎపుడైనా గమనించారా? మీరుంతా కోవిడ్ సతమతమవుతున్నపుడు ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా సబ్సిడీ ఎత్తేసింది. కావాలంటే మీ బ్యాంక్ అకౌంట్స్ చేక్ చేసుకోండి.

2020 మే లోనే ప్రభుత్వం సబ్సిడీ తీసేసింది. అప్పటి నుంచి క్రమంగా ధరలు పెంచడం  మొదలుపెట్టింది.

అంతకు ముందు సిలిండర్ సబ్సిడీ డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ స్కీమ్ కింద సబ్ స్క్రైబర్ ల అకౌంట్ లలో  పడుతూ వచ్చింది. పాండెమిక్ సమయంలో అంతర్జాతీయ మార్కెట్ ఆయిల్ ధరలు పడిపోవడంతో భారత ప్రభుత్వం 2020 మే సబ్సీడిని ఎత్తేసింది.

అదే సమయంలో రెగ్యులర్ ధరలు పెంచి, సబ్సిడీ సిలిండర్ ల ధరలను కూడా  ామార్కెట్ ధరలకు సమానం చేసింది.

2020 సెప్టెంబర్ 1 నాటికి సబ్సిడీ సిలిండర్ ధర, నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రెండూ సమానమయ్యాయి.  ఆ రోజు 14.2 కేజీల సిలిండర్ ధర రు 594 పలికింది. అంతకు మూడు నాలుగు నెలల నుంచి సబ్సీడిని అకౌంట్లలోకి బదిలీ చేయడం మానేసింది.

దీనితో 2021 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర   ప్రభుత్వానికి  రు. 20,000 కోట్ల సబ్సిడీ అదా అయింది.

గత ఏడేళ్లలో వంట గ్యాస్ ధర  నూరు శాతం పెరిగింది. 2014లో మార్చి 1  14.2 కేజీల  సిలిండర్ ధర రు. 415 ఉంటే  ఆగస్టు 18, 2021 నాటికి  రు. 880 దాటింది.  ఈ రోజు రు. 25 పెంచడంతో సిలిండర్ ధర ముంబైలో రు. 859.50 అయింది. కోల్ కతాలో  రు.886, చెన్నైలో  రు. 875.50 అయింది. నిన్న ఈ ధర రు. 850.50 మాత్రమే ఉండింది.

నాన్ సబ్సిడైజుడ్ వంట గ్యాస్ ధర ఆగస్టు ఒకటో తేదీనే పెంచారు. అపుడు సబ్సిడైజ్డు ధర కూడా పెంచాల్సి ఉండింది.అయితే, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, గొడవ అవుతుందేమోనని పెంచలేదు.ఇపుడు పార్లమెంటు లేదు,ధరలు జంకుగొంకు లేకుండా పెంచారు.

సబ్సిడి సిలిండర్లకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ధర పెంచడం ఇదే మొదటిసారి

2021 నుంచి తీసుకుంటే, వంటగ్యాస్ సిలిండర్ ధర రు. 165రుపాయలు పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *