‘రాయలసీమను టిఆర్ ఎస్ రాజకీయాలకు వాడుకుంటున్నది’

అధిక వర్షాల వల్ల నేడు తెలుగు రాష్ట్రాలలో కృష్ణా గోదావరి నదులు పొంగిపొర్లుతున్నాయని, కానీ నీటిని నిలుపు కోవడానికి ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల నీళ్లు వృధా అవుతున్నాయని రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు.

స్థానిక కర్నూలు నగరంలోని జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో డిఈఓ సాయి రామ్ గారి చేతుల మీదుగా రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి నేతలు కరపత్రాలు విడుదల చేయించారు.

ఈ సందర్భంగా డిఈఓ సాయి రామ్ మాట్లాడుతూ తెలుగూ రాష్ట్రాలలో ప్రతి ఎకరాకు నీళ్లు అందే విధంగా ప్రభుత్వంకు సూచనలు చేస్తూ విద్యార్థి జెఎసి చేస్తున్నా ప్రయత్నం అభినందనీయం అన్నారు. ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు జరిపి పంట పొలాలకు నీరు అందించి రైతులను ఆదుకుంటే అత్యధిక పంట దిగుబడి వచ్చి రైతుల మోహల్లో సంతోషం ఉంటుందని అన్నారు.

 

రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇప్పటికే కృష్ణా గోదావరి జలాలు 700 టీఎంసీలు సముద్రంలో కలిశాయని, రాయలసీమకు కేటాయించిన నీళ్లు వాడుకోవడం కోసం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతుంటే తెలంగాణలో టీఆర్ఎస్ తో సహా అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం రాయలసీమకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నాయని అన్నారు.

ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతుందన్న తెలంగాణ ప్రభుత్వం రాజకీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంత వాసులుగా సూటి ప్రశ్న నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల, భక్తరామదాస్, పాలమూరు – రంగారెడ్డి, డిండి, మిషన్ భగీరథ ఇలాంటి అనేక తెలంగాణ ప్రాజెక్టులకు ఏ అనుమతులు ఉన్నాయో ఒక్క సారి మీరే ఆలోచించు కోవాలన్నారు. తెలంగాణ నికర జలాల కేటాయింపు లేకుండా 256 టీఎంసీలు అక్రమంగా వాడుకుంటుందని, కేవలం రాజకీయ లబ్ధి కోసం రైతులు ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించడం మానుకోని రైతులంతా బాగుపడే ప్రణాళికలు రూపొందించాలని తెరాసతో సహా అన్ని తెలంగాణ పార్టీలకు రాయలసీమ నుండి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

ఈ నెల 20న శుక్రవారం నాడు రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని టీజివి కళా క్షేత్రం, సి-క్యాంప్ నందు జరిగే చర్చా కార్యక్రమంలో రాయలసీమ బాగు కోరే ప్రజా విద్యార్థి యువజన రైతు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గోనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి నేతలు బండారి సురేష్ బాబు, సివి సుబ్బయ్య, అబ్బు తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *