ఇదొక విశ్వవిఖ్యాత వ్యక్తి ఆఫీస్, ఎవరిదో ఊహించగలరా?

ఈ ఫోటో ఏదో ఆఫీస్ లాగా ఉంది. ఎవరిదై ఉంటుంది? క్లూ దొరుకుతుందేమో జాగ్రత్తగా చూడండి.

ఏమాత్రం అర్డర్ లేకుండా పేపర్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. కాబట్టి  ఇది ఏ దేశాధినేతదో, ఉన్నతాధికారితో కచ్చింగా అయి ఉండదు. క్షణం తీరికలేకుండా మనిషికి అంతుబట్టని దాన్నిగురించి ఆలోచిస్తూ పరిసరాలనుకూడా పట్టించుకోకుండా బతికిన పెద్దమనిషెవరిదో అయి ఉంటుందేమో అని పిస్తుంది.

ఆఫీషుని,టేబుల్ ని  అలా వదిలేసి పోయాక దాన్ని సర్దేందెకు ఎవరూ లేనట్లుంది.  లేదా ఎవరూ రానట్లుంది. ఏదో పాతపోస్టాఫీసు, రెవిన్యూ కార్యాలయం అనుకుందామా, గోడమీద రాతలేవీ ప్రభుత్వ కార్యాలయాలను సూచించడంలేదు. పోనీ ఏదైన లెక్కల మాస్టారిదనుకుందామా, మాస్టార్లకిలాంటి ఆఫీసులెక్కడుంటాయి?

ఇంకా క్లూలేముున్నాయ్? అందులో ఒక పొగాకు పైపుంది. యాష్ ట్రే ఉంది. ఏదో బాటిల్ ఉంది. ఎవరో డిటెక్టివ్ కార్యాలయమనుకుందామా… అంత సీన్ లేదిక్కడ. మరెవరిదయి ఉంటుంది…ఫిలాసఫీ అని రాసిన పేపర్లుకూడాఉన్నాయి.

వూహాగానాలు మానేసి  విషయానికి వద్దాం. ఇది ప్రఖ్యాత భౌతిక శాస్ర శాస్త్రవేత్త అల్టర్స్ ఐన్ సీన్ కార్యాలయం. ఆయన మరణించిన కొన్ని గంటల తర్వాత ఉన్నదున్నట్లుగా తీసిన ఫోటో ఇది.

సాపేక్ష సిద్ధాంతం  గురించి కనిపెట్టిన ఐన్ స్టీన్ఏప్రిల్ 8,1955న ప్రిన్స్ స్టన్ ఆసుపత్రిలో చనిపోయాడు.చావుని ఆయన ప్రశాంతంగా ఆహ్వానించాడు. మరణం అనేది  ఒక సహజ ప్రక్రియగా ఆయన గుర్తించాడు. అందుకే వస్తున్న చావుని అపేందుకు వాయిదా వేసుకునేందుకు అనవరంగా ఆదుర్దాపడలేదు. మూడు రోజుల ముందు కిందపడ్డారు.బ్రెయిన్ హెమరేజ్ అయింది. నొప్పిని అలాగే భర్తిస్తూ ఉండిపోయాడు. డాక్టర్ ని కలిసేందుకు కూడా పెద్దగా ఇష్టపడలేదని ఆయన సెక్రెటరీ హెలెన్ డ్యూకాక్స్ చెప్పారు. అపుడుపుడు నొప్పి తగ్గేందుకు మార్పీన్ తీసుకుంటూ వచ్చారు. చివరి రోజున నొప్పి నుంచి కొంత ఉపశమనం వచ్చాక ఆయన న్యూస్ పేపర్ చదివాడు. రాత్రిపూట ఆయనెలా వున్నాడు చూసేందుకు హెలెన్ వస్తే, అమెనుపట్టుకుని   రాజకీయాల గురించి, సైంటిఫిక్ విషయాల గురించి చర్చించేవాడు.

“You are really hysterical- I have to pass on sometimes, and it doesn’t really matter when.” అని ఆమెతో అనేవాడు.

చనిపోయిన నాటికి ఆయన వయసు 76 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలు ఎలాంటి రోధనలులేకుండా నిర్మలంగా, కేవలం కుటుంబ వ్యవహారంగా సాగింది. ఆయన కుమారుడు, ఆయన సెక్రెటరీ ఇద్దరు ముగ్గురు సన్నిహితులు మినహా అంత్యక్రియల్లో జనాల్లేరు.ప్రెస్ వాళ్లకు కూడా అవకాశమీయలేదు. అయితే, లైఫ్ (LIFE Magazine)ఫోటో గ్రాఫర్ రాల్ఫ్ మోర్స్  (Ralph Morse)కు కొన్ని ఫోటోలు తీసేందుకు అవకాశం లభించింది. ఈ ఐన్ స్టీన్ ఆఫీస్ ఫోటో కూడా రాల్ప్ మోర్స్ తీసిందే.

20 వ శతాబ్దపు సాటిలేని మేటి మేధావి అంతిమ యాత్రని ఫోటో తీసే అవకాశం మోర్స్ కు ఎలా దొరికిందో తెలియదు. చనిపోవడానికి ముందు ఐన్ స్టీన్ ఆఫీస్ ఎలా ఉండిందో అలాగే తీసిన మహత్తమయిన ఫోటో. ఏ కాగితం పక్కకు జరలేదు. ఏవస్తువును ఎవరూ కదల్చలేదు. బోర్డు మీద లెక్కలను ఎవరూ చెరిపేయలేదు.

ఐన్ స్టీన్ పనిలో పడితే ఎలా ఉంటుందో చూపే ఈఫోటో చాలా అరుదైన ఫోటోయే కాదు, బాగా పాపులర్ అయిన ఫోటో కూడా.

ఈ ఫోటోని మోర్స్ ఎపుడూ పబ్లిష్ చేయలేదు.తాము విషాదంలో ఉన్నందున తీసిన ఫోటోలను ప్రచురించవద్దని ఐన్ స్టీన్ కుమారుడు మోర్స్ నుకోరాడు.  కుటుంబ గోప్యాన్ని మోర్స్ కూడా గౌరవించాడు. ఇదేవిధంగా లైఫ్ మ్యాగజైన్ ఎడిటర్ కూడా ఈ అభ్యర్థనను మన్నించి చాలా కాలం ఈఫోటోలను ప్రచురించలేదు. ఈ పోటో లైఫ్ మ్యాగజైన్ అర్కైవ్స్ లో సుమారు 50 సంవత్సరాలు అలా పడిపోయి ఉన్నాయి. వీటి గురించి అంతా మర్చిపోయారు.

ఐన్ స్టీన్ మరణ వార్తని ఎడిటర్ చెప్పగానే నేను  90 మైళ్ల దూరాన ఉన్న ప్రిన్స్ టన్ హాస్పిటల్ కారేసుకుని పరుగుతీశాను. అక్కడికి ముందుగా చేరుకున్న ఫోటోగ్రాఫర్. తర్వాత అక్కడ జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్లు, చూపరుల ర్దీ పెరిగింది.  నేను నేరుగా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్వాన్స్ డ్ స్టడీస్ లో ఉండే ఐన్ స్టీన్ కార్యాలయానికి వెళ్లాను. దారిలో ఒక స్కాచ్ బాటిల్స్ కేసు కొన్నాను. ఈ సమయంలో అక్కడ ఎవరూ నాతో మాట్లాడే స్థితిలో ఉండరు. అయితే,  స్కాచ్ బాటిల్ ఇస్తే ఎవరు కాదంటారు. డబ్బీయడం కంటేఇలాంటి సాయం మేలుకదా? ఆఫీస్ సూపరింటెండెంట్ ను కలిశాను. స్కాచ్ ఇచ్చాను. ఆయన ఐన్ స్టీన్ కార్యాలయం గది తాళం తీశాడు,’ అని మోర్స్   2014 లో తాను చనిపోవడానికి ముందు ‘లైఫ్.కామ్’ (life.com)కు చెప్పాడు.

తర్వాత మోన్స్ స్మశానానికి వెళ్లాడు. అక్కడ చాలా సమాధులు తవ్వుతున్నారు. వాళ్లకొక బాటిల్ ఇచ్చి ఐప్ స్టీన్ సమాధి ఎక్కడో కనుక్కున్నాను. మరొక 20 నిమిషాల్లో అంత్యక్రియలున్నాయని వాళ్లు చెప్పారు. అంతే, ఫోటోలు తీసుకుని కారెక్కి వచ్చాను. ఆత ర్వాతే కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. అక్కడ ఫోటోగ్రాఫర్లెవరూ లేరు,నేను తప్ప. లైఫ్ ఫోటోగ్రాఫర్ తప్ప. ఇక నా ఆనందం ఎలా ఉంటుందో వూహించండి. విశ్వవిఖ్యాత మేధావి అంతిమ యాత్ర అరుదైన ఫోటోలు నాదగ్గిర ఉన్నాయి. నేను ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాను. నేను ఐన్ స్టీన్ అంతిమ యాత్ర గురించి ప్రపంచానికి చెప్పబోతున్నాను. ఆయన భావేద్వేగంతో నేను ఎడిటర్ ను కలుసుకున్నాను,” అని చెప్పి, మోర్స్ తర్వాతేంజరిగిందో చెప్పాడు. షాకింగ్.

తన ఆనందాన్నీ వ్యక్తీకరించడానికి ముందే లైప్ మ్యాగజైన్ ఎడిటర్ ఎడ్ థాంప్సన్ (Ed Thompson) చావు కబురు చల్లగా చెప్పి మోర్స్ అవాక్యయ్యేలా చేశారు.

“మోర్స్, నాకు తెలుసు,నీ దగ్గిర ఒక అద్భుతమయిన ఎక్స్ క్లూజివ్ స్టోరీ ఉందని. కాని, కొద్ది సేపటి కందట ఐన్ స్టీన్ కొడుకు హాన్స్ ఐన్ స్టీన్ ఫోన్ చేశాడు. ఐన్ స్టీన్ అంత్య క్రియల మీద వార్త వేయవద్దని కోరారు. ఆయన కుటుంబం ప్రైవసీని గౌరవించాలని కోరారు. అందువల్ల నీ స్టోరీని కిల్ చేస్తున్నాను” అని దాంప్సన్ బాంబ్ షెల్ వేశాడు.

అది ఎడిటర్ నిర్ణయం. దాన్నెవరూ కాదనడానికి వీల్లేదు. అందునా ఐన్ స్టీన్ కుటుంబం నుంచి వచ్చిన విజ్ఞప్తి. గౌరవించకతప్పదు. మోర్స్ షాక్ నుంచి తేరుకుని తన పనిలో పడిపోయాడు…

ముగింపు

ఐన్ స్టీన్ చనిపోయాక శవపరీక్ష జరిగింది. ఈ పరిక్ష జరిపిన డాక్టర్  థామప్ హార్వే (1912-2007) ఐన్ స్టీన్ మెదడు అనుమతి లేకుండా తీసి భద్రపరిచాడు. ఐన్ స్టీన్ మేధస్సుకు కారణమేమిటనికొనుగొనందుకు ఆయన అలాచేశాడని చెబుతారు. హార్వే ఈమెదడు ముక్కలు చేసి అనేక ల్యాబరేటరీలకు పంచాడు. ఈఫోటోలో ఐన్ స్టీన్ మెదడును హార్వే ముక్కలు చేస్తున్నాడని చెబుతారు. ఈ ఫోటో తీసింది కూడా మోర్స్ యే. అయితే, హార్వే ముక్కలు చేస్తున్నది ఐన్ స్టీన్ బ్రెయిన్ నేనా అనేది తాను చెప్పలేనని, ఆయన ఇంటర్వ్యూ లో చెప్పారు. మోర్స్ జ్జాపక శక్తి కూడా సన్నగిల్లింది. అదీ కథ.

 

 

Dr. Thomas Harvey (1912 – 2007) was the pathologist who conducted the autopsy on Einstein at Princeton Hospital in 1955. (life.com)

 

అయితే,ప్రిన్స్ టన్ కథనం ప్రకారం 2007లో హర్వే చనిపోయేదాకా ఐన్ స్టీన్  మెదడు ఫార్మాల్డిహైడ్ లో భద్రపరిచేఉండింది. ఐన్ స్టీన్ కళ్లని ఆయన కంటి డాక్టర్ కు ఇచ్చారు. మెదడులో కొన్ని భాగాలను రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్స్ కు ఇచ్చారు. హార్వే మొత్తంగా ఐన్ స్టీన్  బ్రెయిన్ ని  240 ముక్కలు చేశారు. వాటి కణజాలంతో  వేయి మైక్రోస్కోపిక్ స్లైడ్స్  తయారుచేసి ప్రపంచంలోని అనే పరిశోధనా సంస్థలకు అందించాడు. ఐన్ స్టీన్ బ్రెయిన్ అవశేషాలు ఇప్పటికీ మాటర్ మ్యూజియమ్ లో భద్రపరిచి ఉన్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *