తెలంగాణలో రాజకీయ ఉద్యమాలన్నీ ఇపుడు నిరుద్యోగం చుట్టూ తిరుగున్నాయి. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోటా ప్రతిరోజు యువకులు, నిరుద్యోగులు నియామకాల నోటిఫికేషన్ జారీ చేయండని డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ రోజు రెండు చోట్ల నిరసన జరుగుతున్నాయి. ఒకటి హైదరాబాద్ లో భారతీయ యువమోర్చ నిర్వహించింది. 50 వేల ఉద్యోగాలకుత్వరలో నోటిఫికేషన్ అని ముఖ్యమంత్రి ప్రకటించి రెన్నెళ్లవుతున్నా ఇంకా టిఎస్ పిఎస్ సి నుంచి స్పందన లేదని నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజు తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు BJYM రాష్ట్ర అధ్యక్షుడు షూ పాలిష్ చేస్తూ నిరసన తెలిజేశారు.
నిరుద్యోగుల పట భారతీయ జనతా యువమోర్చా నిరంతరం పోరాడుతూ, ప్రగతి భవన్ మెడలు వంచుతుందని, ఉద్యోగాల నియామకాలు పూర్తి అయ్యేదాకా తమ పోరాటం ఆగదని ఆయన చెప్పారు.
మరొక వైపు కరీం నగర్ జిల్లాలో వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం మంగళ వారం దీక్ష నిర్వహిస్తున్నారు.