TTD ఇవొని ఏమయినా అడగాలనుందా? 0877-2263261 కు ఫోన్ చేయండి

కోవిడ్ సమయంలో తిరుమల లో ఉన్న  ఆంక్షల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? తిరుమల రావడంలో మీకేయిన సమస్యలెదురువుతున్నాయా? లేక తిరుమలవకు వచ్చాకా మీరేమయినా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? మీ పట్ల సిబ్బంది ఎవరైనా అవాంఛనీయంగా ప్రవర్తించారా? టిటిడి మీద ఏవయినా ఫిర్యాదులు చేయాలనుకుంటున్నారా? పోనీ టిటిడి పనీతీరు మెరుగుపరిచేందుకు ఎవయిన సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా?

వీటన్నింటికి సమాధానం తెలుసుకోవానుకుంటే ఆగ‌స్టు 7న జరుగుతున్న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో (dial your EO)కార్యక్రమంలో పాల్గొనండి. తిరుమల తిరుపతి దేవస్థానాల సంస్థ (TTD) భక్తుల అనుమానాలను నివృత్తిచేసేందుకు, సమాచారం అందచేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది.

Jawahar Reddy IAS

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఆగ‌స్టు 7వ తేదీన శ‌నివారం తిరుప‌తిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *