గుజరాత్ తర్వాత వేరుశనగకు తెలంగాణ ప్రసిద్ది. ఇక్కడ వేరుశనగ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అధికంగా ఉన్నాయి. తెలంగాణలో వేరుశనగ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు నేపథ్యంలో గుజరాత్ పరిశ్రమలు పరిశీలించడం జరుగుతుంది
తెలంగాణలో ఆఫ్లాటాక్సిన్ (aflatoxin) రహిత వేరుశనగ ఉత్పత్తి అవుతుంది.ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ ఉంది. ఆఫ్లాటాక్సిన్ అనేది ఒక విధామయిన ఫంగస్ ( aspergillus sp.) అది కాన్సర్ కారకం. ఇది తెలంగాణ వేరుశనగ లో ఉండదు.
According to Indian Council of Medical Research (ICMR)-Lucknow, 21 per cent of groundnut in India is unfit for human consumption due to aflatoxin. Another study conducted by Icrisat reveals that the level of aflatoxin in Indian groundnut is 40 times more than permissible limits.
ఈ aflatoxin వల్ల చాలా దేశాలు ఇండియా నుంచి వేరుశనగ నూనె ఎగుమతుల మీద నిషేధం విధించింది. అయితే తెలంగాణ వేరుశనగ ఉత్పత్తులకు బాగా గిరాకీ ఉంటుంది.
తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం భావిస్తున్నది
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మేరకు జిల్లాల వారీ పంటల ఆధారంగా యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో రైతు పండించిన పంటలకు లాభసాటి ధర అందించేందుకు కృషి చేస్తాం. సాంప్రదాయ పంటల సాగు నుండి రైతాంగం బయటకు రావాలి.
కేసీఆర్ నాయకత్వంలో అగ్రి ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.
గుజరాత్ లోని సబర్ కాంఠ జిల్లా
ఓరన్ లో దేవస్య న్యూట్రిషన్ ప్రైవేట్ లిమిటెడ్ వేరు శనగ ఆధారిత పీనట్ బట్టర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు.