డా. సినారె కి ఘన నివాళి

హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్ లో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత , పద్మభూషణ్ , రాజ్యసభ సభ్యులు, మహాకవి డా.సి.నారాయణరెడ్డి గారి 90వ జయంత్యుత్సవంలో ప్రముఖ కవి జూకంటి జగన్నాధం గారికి సినారె పురస్కారం అందించారు.

తెలంగాణ సారస్వత పరిషత్, శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము జరిగింది.

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అవార్డ్ అన్దిన్చారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ గారు, శాంత బయోటెక్ అధినేత, పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి గారు, పరిషత్ చైర్మన్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు, కార్యదర్శి జుర్రు చెన్నయ్య గారు, కోశాధికారి మంత్రి నర్సింహయ్య గారు, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గోన్నారు.

సినారె తెలుగు సాహిత్య శిఖరం అని వక్తలు కొనియాడారు.

– వారి గేయాలు, రచనలు, పాండిత్య సంపద, బహుముఖ ప్రజ్ఞాపాటవాలు అద్వితీయం. మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు వారి సభలు, సమావేశాలకు వెళ్లే వారం. వారి ఆహర్యమే కాదు, వారి ప్రసంగాలు, భావ వ్యక్తీకరణ ఎంతో ఆకట్టుకునేది

రాజ్యసభ సభ్యులుగా సినారె గారు ఆరేళ్లలో 624 ప్రశ్నలు వేశారు .. సాధారణంగా ఒక సభ్యుడు 100, 150 ప్రశ్నలు వేయడం ఎక్కువ.1960 లోనే ఓరుగల్లు రామప్ప గుడి మీద సినారె గారు నృత్యనాటిక రాసారు.

సభలో ప్రముఖ చిత్రకారుడు జేవీ రూపొందించిన సినారె తైలవర్ణ చిత్రం ఆవిష్కరణ జరిగింది.

ఆచార్య ఎల్లూరి శివారెడ్డి  వ్యాఖ్యలు: తెలంగాణ సారస్వత పరిషత్ కు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి సహకారం మరవలేనిది. మంత్రి నిరంజన్ రెడ్డి గారు నిరంతరం సారస్వత పరిషత్ కు అండగా ఉంటున్నారు. జాస్తి చలమేశ్వర్ గారి అభిమానం మరవలేనిది

డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి వ్యాఖ్యలు:సినారె తెలుగు వారి సంపద. వారితో సాన్నిహిత్యం ఉండడాన్ని గర్వంగా భావిస్తున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *