కరోనా వైరస్ ఎక్కడ నుంచి వచ్చిందనే రభస ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రపంచంలో చాలా దేశాలు చైనా వైపు వేలు పెట్టి చూపిస్తున్నాయి. దానికి సంబంధించి నిర్ద్వంద్వంగా జీవశాస్త్ర సంబంధమయిన రుజువులింకా దొరకలేదు. అయితే, కొన్ని ప్రభుత్వాలు, కొంతమంది జర్నలిస్టులు మాత్రం పాత రీసెర్చ్ పేపర్లు తిరగేసి చైనా వూహాన్ ల్యాబ్ లో తయారయిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విచిత్రమేంటే, వైరాలజీలో ఎంతో మంది నిఫుణులున్నా వారి నుంచి ఎలాంటి ప్రకటన రావడంలేదు. ఇంతవరకువచ్చిన ప్రకటనలన్నీ వైరాలజీ బయటి నుంచి వచ్చినవే.
అయితే, ఈ రభస జరిగే క్రమంలో చాలా ఆసక్తికరమయిన విశేషాలు వెల్లడవుతున్నాయి. తాజాగా వెల్లడయిన విషయం ఏమిటంటే, చైనా వూహాన్ ల్యాబ్ లో జరిగిన పరిశోధనలకు నిధులందించింది అమెరికాయే.
దీని మీద అక్కడ పార్లమెంటరీ కమిటీ యే విచారణ చేస్తూ ఉంది. ఈ విషయం మీద పార్లమెంటు ఎగువ సభ సభ్యుడు సెనెటర్ ర్యాండ్ పాల్ (Rand Paul) అమెరికా అంటువ్యాధులనిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌచీ (Anthony Fauci)కి మధ్య పెద్దగొడవ జరిగింది. ఇదంతా చైనా నిధులందించిన వ్యవహారంచుట్టూ తిరిగింది.
నిజానికి అమెరికా, వూహాన్ ల్యాబొరేటరీకి కరోనావైరస్ పరిశోధనలకు సంబంధించి పదేళ్ల అనుబంధం ఉంది. అక్కడి SARS-CoV-2 పరిశోధనలన్నీ అమెరికాకు తెలుసు. దేశాల మధ్య పరిశోధనలకు నిధులందించుకోవడం సర్వ సాధారణం.
ప్రపంచంలో మొట్టమొదటి కరోనా కేసు ఈ వుహాన్ నగరంలోనే నమోదైంది.
కరోనావైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే లీకయిందన్న ధియరీ నిరూపించేందుకు అమెరికా ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ విషయంలో అమెరికా అత్యున్నత శాస్త్రవేత్త అయిన ఫౌచీ ని దోషిగా నిలబెట్టాలని కూడాకొంత మంది ప్రయత్నిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ను తప్పుదారి పట్టించాడని ర్యాండ్ పాల్ ఆరోపించారు.
చైనా పరిశోధనలకు అమెరికా NIH ( National Institutes of Health) నిధులందించ లేదని మే నె 11న ఫాసి ప్రకటించాడని, Wuhan institute of Virology లో జరిగిన గెయిన్ అప్ ఫంక్షన్(Gain of Function) రీసెర్చ్ చేసిన డాక్టర్ షి (Dr Shi) పరిశోధనల కు ఫండ్ ఇచ్చింది NIH యే,” అని పాల్ ఆరోపించారు. కేవలం జంతువులకు మాత్రమే వ్యాపించే కరోనావైరస్ మనిషికి కూడా సంక్రమించేలా జన్యువులో మార్పులు చేసేందుకు చేస్తున్న పరిశోధనలకు ఆమెకు NIH నిధులించ్చింది అని ఆయన ఆరోపించారు.
అయితే తానెపుడూ ఆమెరికన్ కాంగ్రెస్ కు అబద్దం చెప్పలేదని, తన పాత స్టేట్ మెంట్ ను కూడా ఉపసంహరించుకోవడం లేదని డాక్టర్ ఫౌచీ బల్ల గుద్దుతున్నారు. ఆయన వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ తప్పించుకురాలేదని ఆయన నమ్ముతున్నట్లు ఆయన వాదన వింటే అర్థమవుతుంది. వూహాన్ ల్యాబ్ లో తయారయిన వైరస్ లే ప్రపంచమంతా కోవిడ్ సోకించాయనడం తప్పని కూడా ఆయన వాదించారు.
“There is no way the viruses studied at WIV could have evolved into the virus that has caused 4 million deaths around the world.”
పాల్ రాజకీయ భీకరోపన్యాసానికి ఫౌచి తొనక లేదు.ఈ వాదోపవాదాల(Politics versus Science) తో కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి వచ్చిందనే విషయంలో ఆదేశంలోని రాజకీయ నాయకులకు, శాస్త్రవేత్తలకు మధ్య ఏకాభిప్రాయం లేదని వ్యక్తమవుతుంది.
అమెరికా ప్రభుత్వంలో డాక్టర్ ఫౌచీ హోదా చాలా పెద్దది. ఆయన అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘నేషనల్ ఇనిస్టిట్యూ ఆఫ్ హెల్త్'(ఎన్ఐహెచ్)కు అనుబంధంగా ఉన్న ‘అలర్జీలు, అంటు వ్యాధుల జాతీయ సంస్థ, అమెరికా'(NIAID)కు డైరెక్టర్ మాత్రమే కాదు ఆ దేశాధ్యక్షుడు బైడెన్ కూ సలహాదారు కూడా.గతంలో ఆయన డొనాల్డ్ ట్రంప్ కు కూడా సలహాదారే. ఆయన నిజాయితీ, శాస్త్రీయ ధోరణి వల్లే ఆయన బైడెన్ కూడా అదే పదవిలో కొనసాగిస్తున్నారు.
గెయిన్ అప్ ఫంక్షన్ రీసెర్చ్ నుంచి పుట్టిన కరోనా వైరస్ చైనా వూహాన్ లో ఉన్న వైరాలజీ ల్యాబొరేటరీ నుంచి లీకయిందని చాలా మంది అనుమానం.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ మధ్య అమెరికా గూఢచారులను కూడా రంగంలోకి దించి పరిశోధనలను రెట్టింపు చేసి చైనా ల్యాబ్ నుంచే వైరస్ వచ్చిందనే నిజం నిక్కచ్చిగా 90 రోజులలో తేల్చండని పురమాయించారు.
‘Understanding the Risk of Bat Coronavirus Emergence’ అనే వూహాన్ ల్యాబరేటరీ ప్రాజక్టుకు 2014 నుంచి అమెరికా నిధులందిస్తూ ఉంది. ఈ ప్రాజక్టులను అనేక మంది అమెరికా సైంటిస్టులు పరిశీలించారు, ఇది ప్రయోజనకరమయిన రీసెర్చ్ (gain of function)అని గుర్తించారు. ఆ తర్వాతే నిధులీయడం మొదలుపెట్టారు.
‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ (Gain of Function) పరిశోధన అంటే ఏమిటి?
వైరల్ పరిశోధనలన్నింటిలో కూడా కొంత లాభమో నష్టమో ఉంటుంది. మనకు, వైరస్ కూ కూడా. ప్రఖ్యాత తెలుగు సైంటిస్టు డాక్టర్ కాంతా సుబ్బారావు గెయిన్ ఆఫ్ పంక్షన్ గురించి చక్కగా వివరించారు.డా. కాంతా సుబ్బారావు నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ ఎలెర్జీ అండ్ ఇన్ ఫెక్షియస్ డీసీజెస్ ( NIAID)కి చెందిన లాబొరేటరీ అఫ్ ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ (LID) వైరాలజిస్టు. రొటీన్ వైరలాజికల్ రీసెర్చ్ అంతా కూడా వైరస్ జీన్స్ లొ మార్పులు చేర్పులు చేసి మన ఆశించిన ఫలితాన్ని పొందేందుకు (Gain of Function) ఉద్దేశించినవే నని ఆమె అన్నారు.
ఉదాహరణకు వ్యాక్సిన్ స్ట్రెయిన్స్అధికోత్పత్తి సాధించడం ఒక గెయిన్. అయితే, ఒక్కోక్క సారి ఇది వికంటించి నష్టం కూడా జరుగుతుంది (Loss of function). అపుడు వైరస్ లో పిల్లలు పుట్టించే (Replication) శక్తి తగ్గిపోతుంది.ఇది లాస్. దీన్ని జెనెటిక్స్ భాషలో ఆమె ఇలా Alteration of genotype and the resulting phenotypes is considered a type of Gain of Function అన్నారు.
వైరస్ ల బయాలజీ, ఎకాలజీ, అవి తెచ్చే రోగాలను అర్థం చేసుకునేందుకు ఇలాంటి పరిశోధనలు చాలా అవసరం అని కాంతా సుబ్బారావు అన్నారు. డాక్టర్ సుబ్బారావు చెప్పింది ఇంకా వివరంగా చదవాలనుకుంటే Gain-of-Function Research మీద క్లిక్ చేయండి. అందువల్ల గెయిన్ ఆఫ్ రీసెర్చ్ నేరం కాదు.
చైనాలో వైరస్ రీసెర్చ్ కోసం అమెరికా నిధులందించిందా?
అవును, అమెరికా ఈ రీసెర్చ్‌కు కొంత ఆర్థిక సాయం చేసిందని డాక్టర్ ఫౌచీ అన్నారు.
వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసిపనిచేసే లాభాపేక్ష లేని సంస్థ ‘ఎకో హెల్త్ అలయన్స్’ (EcoHealth Alliance) కు ఎన్ఐహెచ్ నిధులిస్తుంది. ఈ సంస్థ అనేక దేశాలలో మంచిపరిశోధనలకు నిధులందిస్తూ ఉంటుంది. ఇట్లా ఎకో హెల్త్ అలయన్స్ ‘Understanding the Risk of Bat Coronavirus Emergence’ కూడా నిధులందించిందని బిబిసి రాసింది.
గబ్బిలాల నుంచి కరోనావైరస్ మనిషికి సంక్రమిస్తుందా లేదా అనేది కనుగొనేందుకు సాగుతున్న చైనా పరిశోధనలకు ఎకో హెల్త్ అలయన్స్‌కు 2014 నుంచి నిధులు మంజూరు చేస్తూ ఉంది.
This project will examine the risk of future coronavirus (CoV) emergence from wildlife using in-depth field investigations across the human-wildlife interface in China, molecular characterization of novel CoVs and host receptor binding domain genes, mathematical models of transmission and evolution, and in vitro and in vivo laboratory studies of host range.(source:NIH)
2019లో ఈ ప్రాజెక్టు నిధులను పొడిగించారు కూడా. అయితే, కరోనావైరస్ ప్రబలిన తరువాత అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం 2020 ఏప్రిల్‌లో రద్దు చేసింది. దీనితో ఒక దశాబ్దకాలంగా వూహాన్ ఇన్ స్టిట్యూట్ తో న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకో హెల్త్ అలయన్స్ కు ఉన్న అనుబంధం తెగిపోయింది.
ఆ రీసెర్చ్ ‘గెయిన్ ఆఫ్ ఫంక్షన్’ కిందకే వస్తుందని రేండ్ పాల్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ 2015, 2017లో ప్రచురించిన రెండు పరిశోధన పత్రాలను కూడా ఆయన ప్రస్తావించారు.
రేండ్ పాల్ అభిప్రాయానికి ప్రముఖ సైంటిస్ట్ ప్రొఫెసర్ రిచర్డ్ ఎబ్రైట్ (Prof Richard Ebright, Rutgers University) వత్తాసు పలికారు.
అంతకు ముందు ఉనికిలో లేని కొత్త వైరస్ లను చైనా సృష్టించినట్లు ఈ రీసెర్చ్ పేపరల్లో ప్రస్తావించారు.ఇది రోగకారక శక్తి ఉన్న వైరస్ లను సృష్టించే ముప్పు అని రిచర్డ్ ఎబ్రైట్ బిబిసికి చెప్పారు. గెయిన్ అఫ్ ఫంక్షన్ రీసెర్చు కిందికే ఇది వస్తుందని కూడా ప్రొఫెసర్ ఎబ్రైట్ చెప్పారు.
ఇంతకీ సెనెటర్ ర్యాండ్ పాల్ చెప్పదల్చుున్నదేమిటి? గెయిన్ ఆప్ పంక్షన్ రీసర్చ్ తప్పు అనా?