మూడో డోస్…షాకింగ్ న్యూస్ చెప్పిన ఎయిమ్స్ చీఫ్ డా. గులేరియా

వ్యాక్సిన్ శక్తి తగ్గిపోతూ ఉంది. ఇండియాలో కూడా మూడో డోస్ అవసరమే…

ఇండియాలో ఒక డోస్ కోవిడ్ వ్యాక్సిన్ దొరకడమేకష్టంగా ఉంది. డోసుకు డోసుకు మధ్య  12 నుంచి 16 వారాలు గడు వుపెట్టినా, మొదటి డోస్ ఇంకా చాలా మందికి అందడం లేదు. చాలా మందికి రెండో డోస్ వేసుకోవడం  ఈ యేడాది సాధ్యం కాకపోవచ్చు. దేశమంతా ఫుల్ వ్యాక్సినేషన్ (రెండు డో సులు) పూర్తికావడానికి ఎంతకాలం పడుతుందో ఎవరూ చెప్పలేకపోతునారు.

ఇలాంటిసమయంలో అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (AIIMS) డైరెక్టర్  డాక్టర్ రణ్ దీప్ గులేరియా మరొక షాకింగ్ న్యూస్ చెప్పారు.

భారతీయులందరికి బూస్టర్ డోస్ అవసరం అని ఆయన అంటున్నారు.

అంటే మూడో డోస్ అన్నమాట. మొదట భారతదేశంలో కనిపించి, ఇపుడు ప్రపంచమంతా చుడుతున్న డెల్టా వేరియాంట్ కరోనావైరస్ తిరిగి దాడి సే ప్రమాదం ఉన్నందున రెండు డోసులు వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లంతా సెకండ్ జనరేషన్  బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన  చెప్పారు.

రెండు తీసుకున్నాక కూడా రోజులు గడిచే కొద్ది వ్యాక్సిన్ ప్రభావం సన్నగిల్లుతున్నట్లు కనిపిస్తున్నది. అంటే మన ఇమ్యూనిటీ తగ్గిపోతున్నది, ముందు ముందు వచ్చే కరోనావైరస్ వేరియంట్లను దృష్టిలో పెట్టుకుని  మనం బూస్టర డోస్ తీసుకోవాల్సిందే నని ఆయన చెప్పారు.

“ It seems that we probably need the booster dose of vaccines as with the passage of time the immunity tends to fall. … There is waning immunity. We would like to have a booster dose that will cover for various emerging vaccines.”

తొందర్లో మనకు  సెకండ్ జనరేషన్ వ్యాక్సిన్లు వస్తాయి.   మొత్తంగా మంచి ప్రభావం చూపడటమే కాకుండా, కొత్త వైరస్ వైరియాంట్ల నుంచి భద్రతనిచ్చేలా రోగనిరోధక్తిని కూడా బాగా పెంచుతాయని డాక్టర్ గులేరియా చెప్పారు.

ఇపుడు ప్రపంచమంతా డెల్టావేరియాంట్ విస్తరిస్తూ ఉంది. దీనితో అనేక దేశాలలో వ్యాక్సినేషన్ ఉధృతం చేయడమే కాదు, మళ్లీ విదేశీప్రయాణాలమీద  ఆంక్షలు విధిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భారతదేశంలో కూడా బూస్టర్ డోస్ ట్రయల్స్ సాగుతున్నాయని, బూస్టర్ డోస్ అంతా ఈ ఏడాది చివరికల్లా బూస్టర్ డోస్ అవసరం రావచ్చని ఆయన చెప్పారు.

ఇండియాలో కూడా బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్స్ వస్తున్నాయి.  రెండుసార్లు వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కరోనా వైరస్ సోకితేదానిని బ్రేగ్ త్రూ ఇన్ ఫెక్షన్ అంటారు. ఇండియాలో  కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నవారికి కూడా కోవిడ్ 19 జబ్బువచ్చిన కేసులు బాగా నమోదవుతున్నాయని ఆయన చెప్పారు.

మూడో డోస్ ట్రయల్స్ కు భారత్ బయోటెక్ కు డిసిజిఐ (Drug Controller General of India)అనుమతినిచ్చిందని, నవంబర్ లోపు ఈ ట్రయల్స్ ఫలితాలు రాబోతున్నాయని ఆయన చెప్పారు.

ఇదే విధంగా అమెరికాలో ఫైజర్ (Pfizer) , బయోఎన్ టెక్ (BioNTech)కూడా బూస్టర్ డోస్ ను రూపొందిస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ రెండుకూడా డెల్టా వేరియంట్ మీద ఎక్కుపెట్టినవే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *