హైదరాబాద్ లోని ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ కు చెందిన రెండు గేట్లను ఎత్తి వరద నీరు మూసి లోకి వదలాల్సి వచ్చింది. ఉస్మాన్ సాగర్ కు 15 గేట్లున్నాయి. ఇందులో రెండింటిని ఒక అడుగు ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని మూసి లోకి వదిలారు. ఇలా రిజర్వాయర్ గేట్లు ఎత్తడం ఈ దశాబ్దంలో ఇదే మొదటిసారి.
ఉస్మాన్ క్యాచ్ మెంట్ ఏరియాలో బాగా వర్షాలు రావడంతో రిజర్వాయర్ లోకి ప్రవాహం బాగా పెరిగింది. దీనితో రిజర్వాయర్ నిండిపోయింది. గతంలో ఇలా రిజర్వాయర్ పూర్తిగా నిండిన సంఘటన 2010లో జరిగింది. గత ఏడాది కూడా రిజర్వాయర్లోకి నీరు పూర్తిగా వచ్చినా గేట్లు ఎత్తే పరిస్థితి రాలేదు.కాని ఈ సారి గేట్టు ఎత్తాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు.
ఉస్మాన్ సాగర్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ (FRL)1,790 అడుగులు. ఇపుడు 1,784 అడుగులకు చేరింది. 3.9టిఎంసిల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ లోకి ఇపుడు 2.81 టిఎంసిల నీరు వచ్చి చేరింది.