ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలుగులో ముఖ్యమంత్రి కెసిఆర్ మీద కేసు పెట్టొచ్చా?

2014లో, 2018 ఎన్నికల్లో గెలిచాక కెసిఆర్ ‘ముఖ్యమంత్రి’ హోదాలో చేసిన నిరుద్యోగభృతి వంటి హామీలు అమలుచేసి తీరాలని, ఢిల్లీ హైకోర్టు ప్రకారం అవి అనుల్లంఘనీయ హామీలని కాంగ్రెస్ నేత శ్రవన్ దాసోజు చెబుతున్నారు. ఇలా కెసిఆర్ ‘గాలికి వదిలేసిన హామీ’ల మీద ఢిలీ హైకోర్టు వెలుగులో నిరుద్యోగులు, తల్లితండ్రులు, న్యాయవాదులు కేసులు వేయాలని ఆయన ఈ రోజు పిలుపునిచ్చారు.

ఢిల్లీ హైకోర్టు తీర్పు ఏమిటి? 

 

ముఖ్యమంత్రులను ఇరుకున పెట్టే విధంగా  ఢిల్లీ హైకోర్టు నిన్న ఒక చారిత్రాత్మక  తీర్పు ఇచ్చింది. అధికారంలో ఉన్న వాళ్లు అమలుచేయవీలు లేని వాగ్దానాలు చేయకుండా కట్టుదిట్టం చేసింది. ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏ ముఖ్యమంత్రి కూడా తాను గతంలో చేసిన వాగ్దానాన్ని గాని హామీని గాలికి వదిలేయడానికి వీలుండదు. అంటే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన వాళ్లు ప్రజలకిచ్చే మాట ‘ఉల్లంఘించ వీలులేని హామీ’ (Promissory Estoppel)అని ఢిల్లీ హైకోర్టు  సింగిల్ జడ్జ్ ధర్మాసనం పేర్కొంది.

ఈ న్యాయసూత్ర ప్రకారం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తానే  మార్చి 29, 2020న  కోవిడ్ పాండెమిక్  కాలంలో పేద ప్రజలకు ఇచ్చి వాగ్దానాన్ని అమలు చేయాలని ఆదేశించింది.

అర్వింద్ కేజ్రీవాల్

జస్టిస్ ప్రతిభా సింగ్ ఈ ఉత్తర్వులు జారీ  చేశారు.  2020  మార్చి 29న లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఎదుర్కొంటున్న విషయాల గురించి చెబుతూ ఇళ్ల యజమానులు అద్దెకున్న పేద ప్రజల నుంచి అద్దేవసూలు వాయిదా వేసుకోవాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.అదే సమయంలో ఆయన మరొక హామీ కూడా ఇచ్చారు. అదేంటంటే  ఆర్థిక సమస్యలవల్ల అద్దెకున్న పేద వారు అద్దె చెల్లించలేకపోతే, వారి తరఫునప్రభుత్వం అద్దె కడుగుతుందని. దీనికి సంబంధించి ఎలాంటి తదుపరి చర్యలు తీసుకొనకపోవడంతో ఒక ఇంటి యజమాని, కొంతమంది అద్దెకున్న వారు కోర్టు ను ఆశ్రయించారు. హామీ ఇచ్చినట్లు అద్దె చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టు నుకోరారు.

ఈ పిటిషన్ విచారణ చేస్తూ జస్టిస్ ప్రతిభా సింగ్ చేసిన వ్యాఖ్యలు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి.  అధికారంలో ఉన్న వాళ్లు ఏదైనా ఒక మాట చెబితే వాళ్ల మీద ఎంతో విశ్వాసం ఉన్న ప్రజలు వాటిని నమ్ముతారు. వాటిని అమలుచేస్తారని విశ్వసిస్తారు, అని ఆమె తన 89 పేజీల తీర్పులో పేర్కొన్నారు. దీనిని అధికారలంలో  ఉన్న వమ్ము చేయరాదని అన్నారు.


Definition of Promissory Estoppel

Noun

The concept that a promise can be legally upheld after a promisee has suffered a loss as a result of relying on that promise.

Origin

1575-1585       Middle French estoupail

Promissory Estoppel Doctrine

The promissory estoppel doctrine allows an injured party to recover on a promise upon which he relied, and then suffered a loss as a result. (source:Legal Dictionary)


అందువల్ల ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం అంటే కచ్చితంగా  అమలుచేయాల్సిన “అనుల్లంఘనీయ న్యాయ సూత్రం” (Promissory Estoppel)అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అది అమలుచేయడమనేది ‘న్యాయబద్ధమయినది ‘ (enforceable promise) ఆమె పేర్కొన్నారు.

“The Promise /assurance/representation given by the CM clearly amounts to an enforceable promise, the Implementation of which ought to be considered by the Government. Good governance requires that promises made to citizens, by those who govern, are not broken without valid justifiable reasons.”

అంతేకాదు, ముఖ్యమంత్రి అన్నీ తెలిసి, తాను అమలుచేయగలననే అధికారంతోనే హామీ  ఇస్తున్నారని అనుకోవాలి. అందువల్ల ప్రభుత్వం తరఫునుంచి ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నపుడు దానిని ఆయన తప్పక అమలుచేస్తారని  జ్ఞానమున్న పౌరుడెవరైనా అనుకోవడం వింతకాదు అని కూడా న్యాయమూర్తి వివరణ ఇచ్చారు.

“The CM is expected to have had the said knowledge and is expected to exercise his authority to give effect to his promise/assurance. To that extent, it would not be out of the place to state that a reasonable citizen would believe that he has spoken on behalf of his government while making the said promise.”

ఢిల్లీ  హైకోర్టు తీర్పును  ముఖ్యమంత్రి కెసిఆర్ మీద ప్రయోగించవచ్చా?

చేయచ్చు అని తెలంగాణ కాంగ్రెస్ నేత ఫ్రొపెసర్ శ్రవణ్ దాసోజు ప్రకటించారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ అనేక రకాల వాగ్దానాలను చేసి వాటిని గాలికి వదిలేశారని, కోవిడ్ పాండెమిక్ సమయంలో కూడా ఆయన  చాలా తప్పుడు సమాచారం ప్రచారం చేసి ప్రజలను పెడదోవ పట్టించానరి ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి  వాగ్దానాలు విని ప్రజలు చాలా నష్టపోయారని, అంటూ ముఖ్యమంత్రి  ప్రజలకు ఇచ్చిన మాట అనుల్లంఘనీయ హామీ (Promissory Estoppel)కాబట్టి తాము ఈ హామీలను అమలుచేయాలని న్యాయపోరాటం చేస్తామని దాసోజు చెప్పారు.

” ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా మంచిది. ఉత్తుత్తి హామీలు ఇచ్చి రాజకీయ ప్రయోజనాలు నెర్చవేర్చుకుంటే ఇక ముందుకుదరదు,” దాసోజు అన్నారు.

ఈ రోజు ఆయన  ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఒక బహిరంగ లేఖ రాసి,కోవిడ్ మరణాల మీద తప్పుడు లెక్కలు విడుదల చేసి ప్రజలను పెడదారి పట్టించారని ఆరోపించారు.దీనితో ప్రజలు కోవిడ్ లేదనుకుని,పరిస్థితులు సాధారణంగాఉందని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనవసరం లేదని భావించి కోవిడ్ బారిన పడ్డారని ఆయన పేర్కొన్నారు.   కోవిడ్ మరణాలు తక్కువ చూపేందుకు, రోగుల మరణ కారణాన్ని దాచి పెట్టారని, ఇది కుటుంబాలు కోవిడ్ ప్రొటోకోల్ ప్రకార ఎలాంటి సాయం పొందుకుండా చేసిందని అది అన్యాయమని ఆయన పేర్కొన్నారు.

“…concealing the actual number of deaths due to Covid-19, the Government of Telangana has done a massive disservice to the society. If only people knew about the actual number of deaths, they could have chosen voluntary lockdown, thereby restraining their movements on their own, and would have been much more careful in terms of following Covid-19 protocols such as maintaining social distancing, compulsory wearing masks, and maintaining Covid appropriate behavior,”అని దాసోజు లేఖలో పేర్కొన్నారు.

కేసీఆర్ పై తెలంగాణ ప్రజలు న్యాయ పోరాటానికి సిద్ధం కావాలి:

ముఖ్యమంత్రి హామీ తప్పితే ప్రజలు కోర్టుకు వెళ్ళవచ్చని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఆయన  స్వాగతించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ని తప్పినందుకు కొందరు వ్యక్తులు వ్యక్తి కోర్టు వెళ్ళిన సంఘటనని ప్రస్తావిస్తూ  రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాక లెక్కలేనన్ని హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా కెసిఆర్  అమలు చేయలేదు.  కేజీ టు పిజీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ బృతి, డబల్ బెడ్ రూమ్ ఇల్లు.. ఇలా చెప్పుకుంటూపొతే … ఒక్క హామీని కూడా కేసీఆర్ అమలు చేయలేదు. కావున చైతన్యగల తెలంగాణ సమాజం, అడ్వకేట్లు, విద్యావంతులు, మేధావులు, ప్రజలు.. కేసీఆర్ పై పెద్ద ఎత్తున న్యాయపోరాటానికి సిద్దం కావాలి. కాంగ్రెస్ పార్టీ కూడా కేసులు వేస్తుంది.” అని  దాసోజుచెప్పారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *