ఆగస్టు 16 నుంచి ఆంధ్రా స్కూళ్లు ఓపెన్

ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునః ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలు పున: ప్రాంభమవుతాయి. వీటితో కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం కూడా రాష్ట్రంలో అమలులోకివస్తుంది. అదే విధంగా మొదటి విడత నాడు నేడు పనులను కూడా అదే రోజు ప్రజలకు అంకితం చేస్తారు.రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం చుడతారు. నూతన విద్యా విధానంపై సమగ్రంగా అదే రోజు మార్గదర్శక సూత్రాలు విడుదల చేస్తారు. విద్యార్థులకు విద్యా కానుక కిట్స్  కూడా అదే రోజు చేస్తారు.

ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ స్కూళ్ల  తెరవడం మీద సమావేశం  నిర్వహించారు. ఇందులో ఆగస్టు 16న పాఠశాలలుప్రారంభించాలని నిర్ణయించారు. సమావేశానికి  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్‌, ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతిక శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షాఅభయాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రి సెల్వి, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ మురళీ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *