అమరావతి : కొల్లేరులో ఉండే చేపలు, రొయ్యలను తినడం ఒక ఎత్తు, అసలు కొల్లేరు సరస్సునే అంచుల్లో కొరికి తినిమాయంచేస్తూండటం మరొక ఎత్తు.ఆసియాలోనే అతిపెద్ద సరస్సుగా ఉన్న కొల్లేరు కుంచించుకుపోతున్నది. కారణం, రైతుల పేరుతో పెద్ద పారిశ్రామిక వేత్తలు , రొయ్యలు, చేపల వ్యాపారులు ఆక్రమించడం.ఈ విషయాన్ని వివరిస్తూ ప్రభుత్వం వెంటనే వెంటనే కొల్లేరు సరస్సును కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ డిమాండ్ చేశారు.
బడా పారిశ్రామిక వేత్తల ఆక్రమణల బారినుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నారాయణ అన్నారు.
లక్షా యాభై వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కొల్లేరుతో ఎన్నో ఒక పెద్ద సాంఘిక ఆర్థిక సామ్రాజ్యంమని దాని ఎందరికో జీవనో పాధి లభిస్తుండటమే కాకుండా, ఎన్నో సాంఘిక, పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సరస్సును కాపాడుకుంటే పర్యాటరంగం కూడా అభివృద్ధి చెందుతుందని, కాలుష్య నివారిణిగా ఉపయోగపడుతుందని నారాయణ చెప్పారు.
అలాంటి కొల్లేరు ఆక్రమనలపై సుప్రీం కోర్టు కూడా స్పందించి ఆక్రమణలను తొలగించాలి అని పేర్కొన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా తాను పనిచేస్తున్న తరుణంలో సరస్సులో సాగుతున్న ఆక్రమణల గురించి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, నేటి ప్రధాని మోడీ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగిందని గుర్తు చేశారు.
ఆ నేపథ్యంలో స్పందించిన నాటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కొన్ని ఆక్రమనలపై చర్యలు తీసుకున్నా చివరికి ఎన్నికల రీత్యా ఆక్రమణ దారులతో రాజీ పడ్డారని పేర్కొన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూడా అదే విధానాన్ని అనుసరించారని చెప్పారు. ఒకరకంగా కొల్లేరు మాఫియా గ్యాంగ్ తో గత ప్రభుత్వాలు రాజీ పడ్డాయని స్పష్టం చేశారు.
ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ చర్యలు తీసుకుంటారు అనుకుంటే వారు కూడా ఏమి చేయలేక పోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కొల్లేరు మొత్తం ఆక్రమణల పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం కొల్లేరు ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని, కాలుష్యాన్ని నివారించే చర్యలు చెప్పట్టలని, ఆ ప్రాంతంలోని నిజమైన రైతులను కాపాడాలని డిమాండు చేశారు.