తెలంగాణ ప్రభుత్వం ఇపుడు నిర్వహిస్తున్న భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపిచింది. మొన్న జిహెచ్ ఎంసి వేలం వేసిన భూములన్నీ కేసీఆర్ బినామీ ల కొన్నారని, వాళ్ల కోసమే భూముల అమ్మకాల జరిగాయని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ కోకాపేట ఫ్రాడ్ గురించిన ఆసక్తికరమయిన వివరాలు వెల్లడించారు.
*కబ్జా ల నుంచి రక్షించడానికి భూమి అమ్మామని సీఎం చెప్తున్నారు. 2005-06సంవత్సరం లో ఇప్పుడు అమ్మిన భూముల పక్కనే ఉన్న భూములు ఎకరాకు రు 14 కోట్ల నుంచి 15 కోట్లు పలికింది.. ఆ రోజు అమ్మగా మిగిలిన భూభులను ఈ రోజు అమ్మితే రెండు వేల కోట్లు వచ్చాయి. ఇది అద్బుతం అని కేసీఆర్ అంటుంన్నాడు.ఎలా?
*భవిష్యత్ లో ప్రజల అవసరం ఏదైనా నిర్మించాలన్నా ఇబ్బందులు ఎదురవుతాయి. చివరకు స్వశానాలకు కూడా భూమి ఉండదు.ఎట్టి పరిస్థితులను ఈ భూముల ను అమ్మొద్దు అని తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు.
* ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మడానికి వెళ్తే కేసీఆర్-హరీష్ రావు- కేటీఆర్ అడ్డుకోని నానా రచ్చ చేశారు.
* ఇ-ఆక్షన్ లో కేసీఆర్ బినామీ కంపెనీలు భూములు దక్కించుకున్నాయి.
*మైహోమ్ రామేశ్వర్ రావు కంపెనీలు 18 ఎకరాలు కొన్నది. సిద్దిపేట కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి సంస్థ రాజ్ పుష్ప 7 ఎకరాలు కొన్నది.
* ఆక్వా స్పేస్ సంస్థకు 390 కోట్లు- రాజ్ పుష్ప సంస్థకు రు.138 కోట్లు లాభం గడించాయి.
*మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అల్లుడు కూడా ఈ భూములు కొన్నాడు..
*మహాబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడు మన్నె సత్యనారాయణ రెడ్డి 7 ఎకరాలు కొన్నడు..
*ప్రిస్టేజ్ కంపెనీ తో కేటీఆర్ కు చీకటి ఓప్పందాలు ఉన్నాయి..
*శ్రీచైతన్య ,నారాయణ సంస్థలు కలిపి దాదాపు 7 ఎకరాల భూములను కొన్నారు..
* 3వేల కోట్లు రావాల్సిన భూములను రు. 2వేల కోట్లకే పరిమితం చేశారు.
* ప్రెస్టీజి సంస్థకు మంత్రి కేటీఆర్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయి.
* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కెటీఆర్ లంచాలు తీసుకోని భూముల గోల్ మాల్ చేశారు. భూ కుంభకోణంలో సీఎస్ సోమేశ్ కుమార్ పాత్ర ఉంది.కేసీఆర్ చెప్పినట్లు సోమేశ్ కుమార్ చేస్తుండు కాబట్టే సోమేశ్ కుమార్ సీఎస్ గా కొనసాగుతున్నారు.
* 50 ఎకరాలు భూమిలో ఎకరానికో రేటు ఎలా ఉంటుంది?
* ఒకే గ్రామంలో ఉన్న ఒక్క ఎకరాకు 60 కోట్లు- మిగిలిన 48 ఎకరాలు 30 నుంచి 40 కోట్లకు ఎలా ధర పలుకుతుంది.
* సిద్దిపేట కలెక్టర్ మిగతా వాళ్ళు ఎవ్వరూ టెండర్లు వేయకుండా ఫోన్ చేసి బెదిరించారు.
* టెండర్లు వేస్తే ప్రభుత్వ అనుమతులు ఇవ్వమని హెచ్చరించారు.
* టీఆరెస్- కేసీఆర్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్న కంపెనీలకే భూములు అప్పజెప్పారు!.
* కోకాపేట లో 50 కోట్లకు తక్కువ ధర లేదు.
* అమ్మిన భూముల్లో 50 అంతస్తుల భవనాలకు అనుమతి ఇవ్వబోతోంది.
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్ల లూటీ జరిగింది.
* గతంలో లిక్కర్ మాఫియా లెక్క- ఇప్పుడు టీఆరెస్ ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు తెరలేపింది.
* 60 కోట్లకు అమ్మిన భూమి తప్ప మిగతా భూమినంతా మళ్ళీ టెండర్లు పిలువాలి.
* స్విచ్ ఛాలెంజ్ విధానం ప్రకారం టెండర్లు పిలువాలి.
* రాజ్ పుష్ప సంస్థ నిబంధనలకు విదంగా రియలేస్టేట్ వ్యాపారం చేస్తోంది.
* త్వరలోనే రాజ్ పుష్ప సంస్థ- వెంకట్రామిరెడ్డి భాగోతం బయపెడుతా!.
* ముఖ్యమంత్రి కేసీఆర్ దోపిడీ పరాకాష్టకు చేరుకుంది.
* తరాల నుంచి వస్తున్న భూములను అమ్మే హక్కు కేసీఆర్ కు లేదు.
* భూ అమ్మకాల్లో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది.
ఈ విషయాలను వెల్లడిస్తూ నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోతే కేంద్ర హోంమంత్రికి, ప్రధానికి ఫిర్యాదు చేస్తానని రేవంత్ చెప్పారు. తెలంగాణకు చెందిన కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి కి కూడా తన దగ్గిర ఉన్న ఆధారాలు ఇస్తున్నానని, తాను ఇచ్చే ఫిర్యాదు పై కేంద్రం- బీజేపీ విచారణకు అదేశిస్తుందో కొన్ని రోజులు వేచిచూస్తానని రేవంత్ చెప్పారు.
ఈ సమాధానం బట్టి టీఆరెస్- బీజేపీ రహస్య ఒప్పందం ఏంటో తెలుస్తుందని ఆపైన ఈ గోల్ మాల్ గురించి పార్లమెంట్ లో మాట్లాడుతానని ఆయన చెప్పారు.