విశ్వ వేమనకొండ ఆశ్రమ పీఠాధిపతి శివైక్యం

*విశ్వ వేమనకొండ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ నాదానంద స్వామి శివైక్యం

(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి)

కటారుపల్లి విశ్వవేమన కొండ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నాదానంద స్వామి గురువారం రాత్రి శివైక్యం అయ్యారు.

బెంగుళూరు పట్టణం సమీపంలోని అనేకల్లు తాలుకాలోని కోనప్పాగ్రహార లో 1940 నారాయణరెడ్డి జన్మించారు. వేమన తాత్వికతకు ప్రభావితుడై 1990 లలో ఆధ్యాత్మిక మార్గం స్వీకరించి నాదానంద గా పేరుతో కొనసాగారు.

1996 లలో వారి గ్రామ సమీపాన ఎలక్ట్రానిక్ సిటీ వద్ద వేమన ఆశ్రమం నిర్మించి కర్ణాటక, తమిళనాడు లోని హోసూరు, కృష్ణగిరి తదితర ప్రాంతాలలో వేమన ఆలోచనలను ప్రచారం చేసారు.

2005 లో అనంతపురము జిల్లాలోని, గాండ్లపెంట మండలం, కటారుపల్లి గ్రామ సమీపంలోని కొండపై వేమన సేవాసమితి ఆధ్వర్యంలో విశ్వవేమన ఆశ్రమం నిర్మాణం చేపట్టారు.

వేమన జ్ఞానమందిరం, గ్రంథాలయం, అన్నదాన కేంద్రం తదితర నిర్మాణాలు చేపట్టి అనేక కార్యక్రమాలు కొనసాగించారు.

గ్రామాలలో పర్యటించి వేమన బొధనలు చేసారు.
అనేక వేమన గ్రంథాలు ప్రచురించారు. అడియో ,వీడియో ల రూపంలో వేమన పద్యాలు తీసుకొచ్చారు.

కర్ణాటక లో జన్మించి కటారుపల్లి లాంటి వెనుకబడిన ప్రాంతాలలో కొండగుట్టలు చదును చేసి వేమన తాత్విక ప్రచారానికి, తెలుగు భాషా విస్తృతికి జీవితాంతం సేవ చేసిన శ్రీ నాదానంద స్వామికి అశృనివాళి అర్పిస్తున్నాం.

వేమన స్మృతి కేంద్రం సమగ్రంగా అభివృద్ధి చేయాలి

పర్యాటక శాఖ వారి ఆధీనంలో ఉన్న కటారుపల్లి లోని వేమన సమాధి ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి సౌకర్యాలు కల్పించాలని స్థానిక శాసన సభ్యులు పెడబల్లి సిద్దారెడ్డి గారిని వేమనరెడ్డి సేవా సంఘం అధ్యక్షులు నారాయణరెడ్డి, కార్యవర్గ సభ్యులు గోపాలరెడ్డి,
వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం అధ్యక్షులు డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి తదిరులు కోరారు.

కటారుపల్లి విశ్వవేమన కొండ పీఠాధిపతి నాదానంద స్వామి శివైక్యం అయిన నేపథ్యంలో వేమన సంఘాల సభ్యులు నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు సిద్దారెడ్డి గారిని కలిసి కటారుపల్లి లోని వేమన సమాధి నిర్వహణ కోసం సిబ్బంది ఏర్పాటు చేయాలన్నారు.

వేమన జయంతిని కర్ణాటక ప్రభుత్వం లాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా చేపట్టేందుకు కృషి చేయాలని కోరారు. వేమన గ్రంథాలయం, పరిశోధన కేంద్రం, వేమన జీవిత చరిత్రను తెలిపే చిత్రశాల తదితరాలను చేయడం వలన వేమన భావాల వ్యాప్తి కి తోడ్పడుతుందని కోరారు.

 

( డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం, అనంతపురము. 9963917187)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *