ఆదివారం గుర్రప్ప కొండకు ట్రెక్, ఆసక్తి వున్నవాళ్లకి ఆహ్వానం

తిరుపతికి చెందిన ట్రెకర్స్ క్లబ్  రేపు  ఆదివారం  చంద్రగిరి సమీపంలోని  గుర్రప్ప కొండకు ట్రెక్ ఏర్పాటుచేస్తున్నారు. ఈ సారి ట్రెక్ లో అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. ఆసక్తి వున్న వాళ్లు, వెంటనే వారికి సంప్రదించాలి. ఫోన్ నెంబర్ లు రాఘవ శర్మ: 94932 26180, భూమన్: 90107 44999. యాబై నుంచి వందమంది దాకా అనుమతించాలనుకుంటున్నారు. మీ లక్ ప్రయత్నించుకోండి. ఈ క్లబ్ ఏర్పాటు చేసే ట్రెక్ లో జీవితంలో మరచిపోలేని అనుభవాలు. ట్రెండింగ్ తెలుగున్యూస్ ఈ ట్రెక్ అనుభవాలను వారం వారం అందిస్తూనే ఉంది.

 

ట్రెక్ వెనక శక్తి 75 సంవత్సరాల భూమన్,

ఈ క్లబ్ ఇప్పటిదాకా వందల ట్రెక్ లను శేషాచలం అడవుల్లో ఏర్పాటు చేసింది. అంతా ఉచితం ఎవరి ఖర్చు వారే భరించాలి. అయితే, కొన్ని అటవీ ప్రాంతాలకు ఫారెస్టు వారి అనుమతి అవసరం. అందువల్ల కొన్ని ట్రెక్ లు వాయిదాపడటమో, రద్దు కావడమో జరుగుతూ ఉంటాయి.

గుర్రప్ప కొండ

స్పెషల్ ట్రెక్ కు ఇప్పటికే రావాలనుకున్నవారికి కొన్ని సూచనలు .

1.ఉదయం 7 గంటల కల్లా గం గుడు పల్లె కు రావాలి.

2. ఎవరి ద్విచక్ర వాహనా ల లో వారు తిరుపతి బైపాస్ రోడ్డు లో బయలుదే రాలి.

3. చంద్రగిరి క్రాస్ దగ్గర CAFE DAY ఉంటుంది. దాని పక్కన రోడ్డు లో బయలుదేరి, డోర్న కంబాల, మల్లయ్య పల్లి, మంటపం పల్లి మీదుగా గంగుడు పల్లి చేరా లి.

4. గంగుడు పల్లి నుంచి గుర్రప కొండ వరకు ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళతాయి. కార్లు వెళ్ల వు.

5. తిరుపతి నుంచి గంగుడు పల్లి కి ద్విచక్ర వాహనం లో అరగంట మాత్రమే ప్రయాణం.

6. బూట్లు వేసు కోవడం మంచిది.

7 . బూట్లు లేక పోతే చెప్పులు ఉన్నా పరవా లేదు.

8. టోపీ పెట్టుకు రండి. ఎండ నుంచి మనల్ని రక్షిస్తున్నది.

9.  బ్యాక్ ప్యాక్ తోనే రావాలి. ఫస్టు ఎయిడ్ ఉండాలి

10. కొండ ఎక్కెటప్పుడు చేతిలో కర్ర తప్ప ఏమీ ఉండ కూడదు.

11. చేతిలో  ఏమున్నా తేలికగా కొండ ఎక్కలేము.

12. ట్రె కింగ్ లో మంచి నీటి అవసరం చాలా ఉంటుంది.

13..కొండ దిగే టప్పుడు నీటి అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

14. మంచి నీళ్ళ విషయం లో ఎవరి అవసరం వారిది.

15. పక్క వారిని నీళ్ళు అడిగితే మొహమాటాని కి ఇచ్చినా, తిరుగు ప్రయాణం లో నీళ్ళు చాలక ఇబ్బంది పడతారు.

16. కనుక ఎవరి నీళ్ళు వాళ్ళు తెచ్చు కోవాలి.

17. బ్యాగు లో లీటరు నీళ్ళ బాటిల్స్ రెండు పెట్టుకొండి .

18. రెండు లీటర్ల బాటిల్ ఒక్క టి మాత్రమే తెస్తే ఇబ్బంది గా ఉంటుంది.

19. టిఫిన్ ఏర్పాట్లు లేవు కనుక ఎవరి టిఫిన్ వారు తెచ్చుకోవాలి.

20. పొద్దున నే టిఫిన్ తయారు కాక పోతే, ముందు రోజు నే బ్రెడ్ జామ్ తెచ్చి పెట్టు కొండి.

21. ఆదివారం తెల్లవారుజామున నే బయలు దేరాలి కనుక ముందు రోజు న నే ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.

22. గుర్రప కొండ పై న శాకాహారం, మాంసాహారం తో మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు ఉన్నాయి.

23. విశాల మైన గుర్రప్ప కొండ పైన, చెట్ల మధ్య సాయంత్రం వరకు ఆనందంగా గడుపుదాము.

24. సమయ పాలన తప్పకుండా పాటించాలి.

25. గంగుడు పల్లి దగ్గరకు 7 గంటల కల్లా చేరాలి. ఎవరైనా ఆలస్యం అయితే, వారిని కొండ పైకి తీసుకు రావడానికి మనుషుల ను ఏర్పాటు చేశారు. ఎవరెవరు రాదలిచారు తమ సమ్మతిని తెలపండి. అనుమతి తీసుకోండి.

 

-రాఘవ శర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *