అతి చిన్నవయసు లో ఒలింపిక్ మెడల్ కొట్టేసిన పిడుగు

(సలీమ్ బాషా)

ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన అతి పిన్న వయస్కుడు గ్రీస్ కు చెందిన  డిమిట్రియోస్ లౌండ్రాస్ (Dimitrios Loundras). మెడల్ సాధించి నాటికి అతని వయస్సు పదేళ్ల 218 రోజులు. అతను పతకం సాధించింది  1896 సమ్మర్ ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో. ఇప్పటికీ కూడా ఆ రికార్డు అలాగే పదిలంగా ఉంది. సమాంతర బార్ ఈవెంట్లో లౌండ్రాస్ కాంస్య పతకం సాధించాడు. విచిత్రమేంటంటే లౌండ్రాస్ కంటే ముందు ఒక ఫ్రెంచ్ కుర్రాడు నెదర్లాండ్స్ దేశం తరఫున 1900 ఒలింపిక్స్ లో ఏడేళ్ళ వయసులో పాల్గొన్నాడు. అయితే ఆ కుర్రాడు ఎవరో ఇంతవరకు తెలియదు. ఆ మిస్టరీ బాయ్ బోట్ రేసింగ్ లో పాల్గొన్నాడు. ఆ ఈవెంట్లో పడవను నడిపాడు.

బీర్ తాగి మెడల్ పొగొట్టుకున్న అథ్లెట్

మెక్సికో 1968 ఒలింపిక్ క్రీడలు స్పోర్ట్స్ ప్రపంచాన్ని మార్చిన కొన్ని మర్చిపోలేని క్షణాలు గుర్తుకు వస్తాయి.

* టామీ స్మిత్(అమెరికాకు చెందిన అథ్లెట్), జాన్ కార్లోస్(అమెరికాకు చెందిన అథ్లెట్) బ్లాక్ ఫ్రీడమ్ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ పోడియంపై తమ నల్లని చేతి తొడుగులు పైకి లేపడం.

* తూర్పు మరియు పశ్చిమ జర్మనీ మొదటిసారి విడివిడిగా పోటీపడటం. డ్రగ్స్ టెస్ట్ చేయబడిన మొదటి ఆట కూడా ఇదే. ఫలితంగా మొదటి అథ్లెట్ సానుకూల పరీక్ష కోసం తన పతకాన్ని కోల్పోవలసి వచ్చింది. ఆ అథ్లెట్ పేరే స్వీడన్ కు చెందిన హన్స్-గున్నార్ ల్జెన్వాల్. అతను చేసిందల్లా ఒక్క బీర్ తాగటమే! దాంతో అతను తన కాంస్య పతకాన్ని కోల్పోయాడు. పిస్టల్ షూటింగ్ లో అతని జట్టు కాంస్య పతకం సాధించింది. అలా ఆల్కహాల్ వల్ల మెడల్ పోగొట్టుకున్న మొదటి క్రీడాకారుడు అయ్యాడు. డోపింగ్ టెస్ట్ ద్వారా పతకం పోగొట్టుకున్న మొదటి ఆటగాడు కూడా ఇతనే. 2018 ఆల్కహాలు గురించి క్రీడాకారుల ను టెస్ట్ చేయడం ఆపేశారు.

* ఈ ఒలింపిక్స్ లోనే భారత దేశపు ప్రముఖ పరుగుల రాజు మిల్కా సింగ్( ఈ మధ్యనే చనిపోయాడు) తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు.

Saleem Basha

(సలీమ్ బాషా, స్పోర్ట్స్ జర్నలిస్టు, హోమియో వైద్యుడు సెల్ నెం. 93937 37937 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *