భారత ప్రభుత్వం చెంపలేసుకుంది. సుప్రీంకోర్టు దేశంలో జరుగుతున్న దురాగతాన్ని వెేలెత్తి చూపి, ఇంత దారుణానికి ఒడిగడగుతున్నారా అని ప్రశ్నించడంతో కేంద్ర హోం శాఖ చెంపలేసుకుని అన్యాయంగా దేశవ్యాపితంగా, ఐటి యాక్ట్ సెక్సన్ 66A కింద బుక్ చేసిన కేసులన్నంటిని ఎత్తేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.
ఈ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత దుర్వినియోగం చేస్తున్నాయో చూసి సుప్రీంకోర్టు అవాక్కయిన పది రోజుల తర్వాత కేంద్రం ఈ కేసులన్నింటిని తక్షణం ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Informatio Technology Act, Section 66A అన్యాయమయిందని సుప్రీంకోర్టు 2015 మార్చి 24 తేదీనే (Shreya Singhal vs U.O.I on 24 March, 2015) కొట్టి వేసింది. అయితే, కేంద్రం, రాష్ట్రాలు మాత్రం ఈ విషయాన్ని తొక్కిపెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్, ట్విట్టర్ లో , ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పోస్టులు పెట్టినా, కార్టూన్ లు గీచినా, చివరకు వాటిని లైక్ చేసిన ఈ సెక్షన్ కింద కేసులు పెట్టి దేశమంతా అప్రకటిత ఎమర్జన్సీని అమలు చేశాయి.
దీనితో ఇపుడు దేశంలో ఎమర్జన్సీ అమలు అవుతూ ఉందనే అపకీర్తి ప్రధాని మోదీ ప్రభుత్వానికి వచ్చింది. ఈచట్టాన్ని జర్నలిస్టుల మీదప్రముఖంగా ప్రయోగించి హింసించారు. ఈ రోజు ఉత్తర్వులతో సోషల్ మీడియా పోస్టుల వల్ల కేసుల్లో ఇరుక్కున్న వారందరికి విముక్తి దొరుకుతుంది.
“What is going on ? It is terrible…Shocking” అనేది జూలై 5 వ తేదీన చెల్లదని కోట్టేసిన చట్టం ప్రయోగించి కేసులు బుక్ చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చినపుడు న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమన్ చేసిన ఆశ్చర్య వాక్యం.
ఇది సుప్రీంకోర్టు చరిత్రలో మరిచిపోలేని వాక్యం గా మిగిలిపోతుంది. ఈ వ్యాఖ్యతర్వాతే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 66A కింద నమోదు చేసిన FIR లన్నింటిని కొట్టివేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, పోలీసు అధిపతులకు సూచనలిచ్చింది.
“It has been brought to our notice through an application in the Supreme Court that FIRs are still being lodged by some police authorities under struck-down provisions of Section 66A of the IT Act 2000. The Hon’ble Supreme Court has taken a very serious view of the matter.” అని రాష్ట్రాలకు సమాచారం పంపింది.
దానితో పాటు, ఈ సెక్షన్ కింద ఏ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు బుక్ చేయరాదని సూచనలిచ్చింది.
“If any case has been booked in your state under Section 66A of the IT Act, it should be immediately withdrawn.”అని స్పష్టమయిన ఆదేశాలిచ్చింది.
ఈ సెక్షన్ కింద టెక్స్ట్, ఆడియో, వీడియో, చిత్రాలతో పాటు మరేవిధమయిన ఎలెక్ట్రానిక్ పద్దతిలో సమాచారం పంపినా మూడేళ్లు జైలు శిక్షవిధించవచ్చు. దీనిని నుపయోగించి సోషల్ మీడియా ప్రభుత్వాలకు, ప్రభుత్వానిధినేతలకు వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్ వచ్చినా పోలీసులు కేసులు పెట్టడం, అరెస్టు చేయడం మొదలుపెటారు. కొన్నివందలమందిని అరెస్టుచేశారు.
2015లో మార్చిలోనే ఈ సెక్షన్ ను కొట్టి వేసిన ఆసంవత్సరం 332 కేసులు బుక్ చేశారు. 2016లో 216 కేసులు బుక్ చేశారు.2017లో 290కేసులు, 2018లో 318కేసులు, 2019లో 253 కేసులు, 2020 ఫిబ్రవరి దాకా 24 కేసులు బుక్ చేశారని హిందూస్తాన్ టైమ్స్ రాసింది.
66A సెక్షన్ దుర్వినియోగం ఎలా బయటకు వచ్చిందంటే… ఇది చదవండి
https://trendingtelugunews.com/top-stories/breaking/supreme-shocked-cases-booked-under-it-act-66a-struck-down-the-court/