వరకట్న దూరాచారాన్ని రూపుమాపాలని కోరుతూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బుధవారం నాడు రాజ్ భవన్ లోనే ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. రాజ్ భవన్ లో ఇలా సామాజిక జాఢ్యం మీద నిరాహారదీక్ష జరగడం , అందునా ఏకంగా ఒక రాష్ట్ర ప్రథమ పౌరుడే ఇలాంటి నిరసన చేపట్టడం బహుశా చరిత్రలో మొదటి సారి అయివుండవచ్చు.
ఇది వ్యవస్థ మీద ఎక్కు పెట్టిన బాణం. దేశంలోని ఏ ప్రభుత్వం కూడా ఈ జాఢ్యాన్ని అరికట్టలేకపోయింది. ఇపుడే ఆయనకు ఇలా జనచైతన్య నిరాహార దీక్ష చేపట్టాలనిపించేందుకు కారణం, విస్మయ అనే మహిళ వరకట్నానికి బలికావడమే. ఈ దుర్ఘటన తర్వాత ఆయన విస్మయ ఇంటిని కూడా సందర్శించారు. గత 30 రోజులలో రెండు కట్నం వేధింపుల మరణాలను రికార్డయ్యాయి. కేరళ వంటి ప్రగతిశీల రాష్ట్రంలో ఇలాంటి దుర్ఘటనలు జరగడంతో ఆయనచలించారు. ఇది రాష్ట్రాన్ని కుదిపివేసింంది. దీనితో పలు గాంధేయ సంస్థలు వరకట్న జనచైతన్య కార్యక్రమాలు చేపట్టాయి.
ఉదయం 8 గంటలకు ఆయన నివాసంలో ఈ దీక్ష చేపట్టారు. అనేక గాంధేయ సంస్థలు వరకట్నదురాచారాలకు వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నారు.
“Our beloved state of Kerala was recently in the news for a tragic death due to dowry. It is sad, that the specter of dowry continues to raise its ugly head in our state which has been globally acclaimed for enviable social indicators like literacy and life expectancy,” అని ఆరిఫ్ ఖాన్ అన్నారు.
గవర్నర్ దీక్ష సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ మధ్య లో గాంధీ భవన్ లో జరిగిన ప్రార్థనలకు కూడా హాజరయ్యారు.
కేరళ ఈ మధ్య వరకట్నపు చావుల వార్తలకెక్కింది. అక్షరాస్యతలో సగటు ఆయుర్దాయంలో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన కేరళ ఇలాంటి వార్తలకెక్కడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు.
ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ విలక్షణమయిన రాజకీయనాయకుడు. ఇపుడాయన బిజెపిలో ఉన్నా ఆయన ప్రస్తానం సుదీర్ఘమయింది. అలీఘఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంవిద్యార్థి సంఘంనాయకుడిగా ఆయన రాజకీయాలు ప్రారంభమయ్యాయి. తర్వాత భారతీయ కాంత్రి దళ్ నుంచి అసెంబ్లీ రాజకీయాల్లోకి వచ్చారు. 27 యేళ్ల వయసులోనే ఆయన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరారు. రాజీవ్ గాంధీప్రభుత్వం ముస్లిం పర్సనల్ లా చట్టం తీసుకువచ్చినపుడు నిరసనగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు.ఈ బిల్లు ముస్లిం మహిళల జీవన భద్రత హక్కును హరించివేసిందని, ముస్లిం మహిళలకు మాజీ భర్తలు మెయింటెనెన్స్ ఇవ్వకుండా చేసిందని ఆయన నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నుంచి తప్పుకున్నారు.
తర్వాత జనతాదళ్ లో చేరి ఎంపి అయి, మంత్రి అయ్యారు.జనతా దళ్ పతనం తర్వాత ఆయన బిఎస్ పిలోచేరి లోక్సభ కు ఎన్నికయ్యారు. అపుడాయన సెక్యులర్ విలువలకోసం నిలబడిన నేత. పార్లమెంటులో నాటి గొప్ప వక్తల్లో ఆరిఫ్ ఖాన్ ఒకరు. తర్వాత ఆయన బిజెపి వైపు వచ్చారు. ఎంపిగా గెలుపొందారు. మోదీ హయాంలో ఆయన గవర్నర్ అయ్యారు.