పెట్రోల్ డీజిల్ ర్యాలీ: టీం రేవంత్ మొదటి ప్రోగ్రాం

నిత్యం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపును వ్య‌తిరేకిస్తూ.. కేంద్ర ప్రభుత్వ వైఖ‌రిని ఎండ‌గ‌డుతూ టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ జరగనుంది. పీసీసీ అధ్యక్ధుడు అయ్యాక రేవంత్ చేపడు తున్న తొలి కార్యక్రమం ఇదే.

బైక్ ర్యాలీ ఉ.11.00 గం.ల‌కు టోల్ ఫ్లాజా నుంచి ప్రారంభ‌మై సెయింట్ థామ‌స్ స్కూల్‌,గాంధీ పార్కు ద‌గ్గ‌ర ముగుస్తుంది.

ఎద్దుల‌బండి, సైకిల్ ర్యాలీ  పాద‌యాత్ర లు కూడా ఉంటాయి.ఇవి మ‌ధ్యాహ్నాం.12.00 గం.ల‌కు ప్రారంభ‌మై గాంధీ పార్కు ద‌గ్గ‌ర అంబేద్క‌ర్ చౌక్ ద‌గ్గ‌ర ముగింపు ఉంటుంది.

మధ్యాహ్నం. 1.00 గం.ల‌కు అంబేద్క‌ర్ చౌక్‌లో బ‌హిరంగ స‌భ జరుగుతుంది.

ఏఐసీసీ పిలుపు మేరకు నేడు పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో ఎడ్ల బండ్లు, సైకిల్‌ ర్యాలీలతో ఆందోళనలు చేపడుతున్నారు.

నిర్మల్‌లో జరగనున్న ఎండ్ల బండ్లు, సైకిల్‌ ర్యాలీలో పాల్గొనున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ పాల్గొంటుంటేహైదరాబాద్ లో ధర్నాచౌక్ నుంచి నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. అక్క పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్,గీతారెడ్డి పలువురు నాయకులు ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *