వ్యాక్సిన్ మూడో డోస్ అవసరమంటున్న కంపెనీలు, వద్దంటున్నఅమెరికా

అనుకున్నంత జరగుతూ ఉంది.  వ్యాక్సిన్ తయారీలో వ్యాపారం బాగా డబ్బులుండటంతో కంపెనీలు మూడో అవసరాన్ని సృష్టించి, ప్రభుత్వాలను ఒప్పించి, మూడో బూస్టర్ తీసుకునేలా చేస్తాయా?

కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం ఎంత కాలం ఉంటుందో కచ్చితంగా  తెలిసే అవకాశంలేకపోవడంతో మూడో డోస్ ను వ్యాక్సిన్ కంపెనీలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, ఇందులో వ్యాపార ప్రయోజనాలే ప్రధానంగా ఉన్నాయని విమర్శకులు చెబుతున్నారు.

రెండో డోస్ ప్రభావం అయిదారు నెలల్లో తగ్గిపోతున్నదని, అదే సమయంలో కొత్త కరోనా వేరియంట్లు తయారువుతున్నందు మూడో డోస్ అవసరమవుతుందని  వ్యాక్సిన్ కంపెనీలు చెబుతున్నాయి. ఇపుడు అమెరికాలో తాజాగా మూడో డోస్ వాదనను ఫైజర్-బయో ఎన్ టెక్ కంపెనీలు తీసుకువచ్చాయి. తమ వాదనకు బలం చేకూర్చుకునేందుకు ఫైజర్ ఇజ్రేల్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికను చూపిస్తూ ఉంది.

మూడోడో స్ మీద ఇప్పటికే  ఇంగ్లండులో ఏడురకాల  కోవిడ్-19 వ్యాక్సిన్ లు మూడో బూస్టర్ అవసరం మీద ట్రయల్స్ మొదలుపెట్టాయి. దేశవ్యాపితంగా జరుగుతున్న ఈ ట్రయల్స్ లో భాగంగా  బ్రాడ్ ఫోర్డ్ ఎన్ హెచ్ ఎస్ కు చెందిన ప్రొఫెసర్ ఎలెక్స్ బ్రౌన్ (Professor Alex Brown)  ప్రపంచంలో మూడో బూస్టర్ డోస్ తీసుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు.

యుకె లో మొదయిలన COV-BOOST ట్రయల్ లో ఏడు కంపెనీలు పాల్గొంటున్నాయి. వ్యాక్సిన్ ప్రభావం ఎంతకాలం ఉంటుందో నిర్ధారించి, ధర్డ్ డోస్ అవసరమవుతుందోలేదో ఈ ట్రయల్స్ లో తేలుతుంది.యుకె లో 18సెంటర్లను ఎంపిక చేసి ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

ఇలాంటపుడు అమెరికాలో మూడో బూస్టర్ డోస్ చర్చను  తెరలేపింది ఫైజర్.

ఈ సంస్థ మూడో డోస్ వ్యాక్సిన అవసరమని వాదిస్తూ ఉంది. అయితే, అమెరికా అధికారుల నుంచి మూడోె డోస్ గురించిన స్పందన ప్రోత్సాహకరంగా లేదు. మూడో డోస్ అంటే ప్రభుత్వాలమీద, ప్రజల మీద  భారం మోపుతుంది. అందువల్ల ప్రభుత్వాలు జాగ్రత్తగా, శాస్త్ర పరిశోధనల అధారంగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

వ్యాక్సిన్ మూడో డోస్ ఇచ్చేందుకు  ఆమెరికా పభుత్వ అనుమతి కోరాలనుకుంటున్నట్లు ఫైజర్-బయోఎన్ టెక్ (Pfizer-BioNTech)  ప్రకటించాయి.

కోవిడ్ వ్యాక్సిన్ మూడో డోస్ వేస్తే కరోనాకు వ్యతిరేకంగా నిరోధకశక్తి ఇంకా దృఢపడుతున్నదని,  కోవిడ్ కు వ్యతిరేకంగా బలం బాగా పెరుగుతున్నదని తమ పరీక్షలలో తేలడంతో ఫైజర్- బయోఎన్ టెక్ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయాన్ని సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి.

మూడో బూస్టర్ డోస్ పరీక్షల నుంచి మంచి ఫలితాలువస్తున్నాయని చెబుతూ కరోనవైరస్ ను తటస్థీకరించే యాంటిబాడీల సంఖ్య శరీరంలో   అయిదు నుంచి పదింతలు పెరగడం మూడో డోస్  ట్రయల్స్ లో కనిపించిందని ఈ సంస్థలు పేర్కొన్నాయి.

ఈ ట్రయల్స్ డేటాను వచ్చే రెండు మూడు వారాల్లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ ఎడ్మినిస్ట్రేషన్ (FDA)కుఅందివ్వబోతున్నట్లు కూడా ఈ సంస్థలు తెలిపాయి. అయితే, మూడో డోస్ అవసరమా లేదానే అనేవిషయాన్ని నిర్ధారించేది FDA, CDC (Centres of Disease Control and  Prevention)లే.

అయితే, మూడో బూస్టర్ డోస్ ను వ్యాక్సిన్ లాభాపేక్షతో సృష్టిస్తున్నాయని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో అవసరమయితే, ప్రభుత్వాలు భారీగా నిధులు ఖర్చుచేయాల్సివస్తుంది. అందకేనేమో ఆమెరికా అధికారుల స్పందన మూడో బూస్టర్ డోస్ కు అనుకూలంగా లేదు.

ఫైజర్,మాడెర్నాల వ్యాక్సిన్ లు రెండు డోసులు చాలని, దానితో డెల్టావేరియంట్ నుంచి కూడారక్షణ వస్తున్నదని CSDS  చీఫ్ఆంథోని ఫౌసి  చెబుతున్నారు.

వ్యాక్సిన్ ప్రభావం రోజులు గడిచే కొద్ది తగ్గుతూ ఉందని చెప్పే  ఇజ్రేల్ ప్రభుత్వ డేటాను చూపించి  ఫైజర్ తన వాదన వినిపిస్తున్నది.

వ్యాక్సిన్ ప్రభావం ఆరు నెలల తర్వాత కరోనా ఇన్ఫెక్షన్ ని,  జబ్బుల లక్షణాలను తగ్గించడంలో తరిగిపోతున్నట్లు ఇజ్రేల్ ఆరోగ్య శాఖ చెప్పినట్లు ఫైజర్ చెబుతూ ఉంది.

“As seen in the real world data released from the Israel Ministry of  Health vaccine efficacy in preventing infection and symptomatic diseases has declined six months post-vaccination, although efficacy in preventing illness remains high,” అని ఫైజర్ తెలిపింది.

ఇంతవరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, రెండో డోసు తీసుకున్న తర్వాత 6  నుంచి 12 వారాలలోపు మూడో బూస్టర్ డోసు తీసుకుంటే కరోనా నుంచి మాంచి రక్షణ ఉంటుందని తాము నమ్ముతున్నట్లు ఫైజర్-బయో ఎన్ టెక్ లు చెబుతున్నాయి.

భవిష్యత్తు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కోవిడ్ డెల్టావేరియంట్ మీద ఎక్కు పెట్టి, మార్పు చేసిన వ్యాక్సిన్ మీద ఆగస్టులో ట్రయల్స్ జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు  కూడా ఈకంపెనీలు తెలిపాయి. లేదంటే వ్యాక్సిన్ మూడో డోస్ తీసుకోవచ్చని ఈ కంపెనీలు చెప్పాయి.

ఫైజర్ మూడో బూస్టర్  డోస్ వాదనని అమెరికా ప్రభుత్వం సంస్థలు అంత  సీరియస్ గా తీసుకోలేదు.   ఎఫ్ డిఎ, సిడిసి లు ఒక సంయుక్త ప్రకటన  రెండు డోసుల వ్యాక్సినేషన్ భేష్ అని చెప్పాయి.

ఇప్పటికి పూర్తి వ్యాక్సిన్ తీసుకున్న అమరికా ప్రజలకు ఇప్పటికయితే మూడో డోస్ అవసరం లేదు. మూడో డోస్ అవసరమా అనే దాని  శాస్త్రీయంగా తాము పరిశోధన చేసి తేలుస్తామని ఈ సంస్థలు చెప్పాయి.

ఇపుడున్న రెండు డోసులు వ్యాక్సినేషన్ చాలా శక్తి వంతమయిందని  ఈ సంస్థలు పునురుద్ఘాటించాయి. “People who are fully vaccinated are protected from severe disease and death, including from the variants currently circulating in the country such as Delta,” అని FDA, CDCలు తెలిపాయి.

(featured image credit:  torstensimon from Pixabay )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *