కొత్త రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే శాఖ కొత్త సంప్రదాయం మొదలుపెట్టారు. తన కార్యాలయంలో అధికారులు ఉద్యోగులు రెండు షిఫ్ట్ లలో పనిచేయాలని ఆదేశించారు. గురువారం నాడుబాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఈ ఉత్తర్వులిచ్చారు.కాకపోతే, ప్రస్తుతానికి ఈ ఉత్తర్వులు రైల్వే మంత్రి కార్యాలయానికే పరిమితం.
ఇక నుంచి రైల్వే మంత్రి కార్యాలయం ఉదయం ఏడునుంచే పనిచేయడం మొదలుపెడుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం ఏడునుంచి మధ్యాహ్నం తర్వాత 4 నాలుగుగంటల దాకా ఉంటుంది.రెండో షిఫ్ట్ మధ్యాహ్నం మూడు నుంచి అర్థరాత్రి పన్నెండు దాకా పనిచేస్తుంది. రైల్వేను సమూలంగా మార్చాలనేది, రైల్వే ప్రయోజనాలు సామాన్య ప్రజలకు అందాలనేది ప్రధాని లక్ష్యమని, దీనికి తగ్గట్టు మంత్రి కార్యాలయం పనిచేస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారుప
అశ్వినీ వైష్ణ వ్ ఎవరు?
అశ్వినీ వైష్ణవ్ రాజకీయ నాయకుడు కాదు. ఐఐటి ఎంటెక్ చేశారు. ఆయన 1994 వ బ్యాచ్ ఐఎఎస్ అధికారి. రాజస్తాన్ లోని జోధ్ పూర్ కు చెందిన వాడు. అయితే, ఒరిస్సా క్యాడర్ అధికారి. ఒరిస్సాలో కలెక్టర్ గా కొద్దిరోజులు పనిచేసి వాజ్ పేయి హయాంలో డిప్యూటీసెక్రెటరీ ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కొద్దిరోజులు పనిచేశాక, అమెరికా వార్టన్ స్కూల్ లో ఎంబిఎ చేశారు.ఆ కోర్సుకు చేసి అప్పుల్లో పడ్డానని చెప్పి ఆయన ఐఎఎస్ కు రాజీనామా చేసి అమెరికాలో జి.ఇ వంటి పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేశారు. కొన్ని సంవత్సరాలు పనిచేశాక, ఇండియాలో వచ్చి సొంతంగా కొన్నికంపెనీలు ప్రారంభించారు. 2019 లో ఆయన చిత్ర మయిన పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుడయ్యారు. మొదటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆయనను బిజూ జనతా దళ్ తరఫున రాజ్యసభకు నామినేట్ చేయాలనుకున్నారు.అయితే, అంతలోనే తాను బిజెపి తరఫున రాజ్యసభకు నామినేషన్ వస్తున్నట్లు వైష్ణవ్ స్వయంగా ప్రకటించారు. తర్వాత ప్రధాని స్వయంగా నవన్ పట్నాయక్ కు ఫోన్ చేసి వైష్ణవ్ గెలిచేందుకు సహకరించాలని కోరారు. దీనితో ఆయన పోటీ లేకుండా రాజ్యసభ కు ఎన్నికయ్యారు. తొలిసారి ఎంపి అయి, తొలిసారి క్యాబినెట్ మంత్రి అయిన వైష్ణవ్ కు రాజకీయానుభవం లేదు. కాకపోతే, ఆయన అనేక రంగాలలో ఉన్నత పదవులలో పనిచేసిన నైపుణ్యాన్ని మోదీ క్యాబినెట్ తీసుకువస్తున్నారు. రైల్వే శాఖ తో కమ్యూనికేషన్స్-ఐటి శాఖ బాధ్యతలను కూడా ప్రధాని ఆయనకే అప్పగించారు. ప్రధాని ప్రయారిటీస్ ఇపుడు మారిపోతున్నాయని, రాజకీయాలతోపాటు పనితీరుకు కూడా ఆయన ప్రాముఖ్యం ఇస్తున్నారని వైష్ణవ్ వంటి వారిని చూస్తే అర్థమవుతుంది.