టిఆర్ ఎస్ లో చేరనున్న తెలంగాణ టిడిపి చీఫ్ ఎల్ రమణ

రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కొద్దిసేపట్లో టీఆర్ఎస్ లో చేరనున్నారు.   ప్రగతిభవన్‌కి  కేసీఆర్‌ను కలసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు.

రెండు రాష్రాలు విడిపోయాక, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎల్ రమణను తెలంగాణ విభాగం అధ్యక్షుడిని చేశారు.

తెలంగాణలో టిడిపి పుంజుకుంటుందని భావించారు. పూర్తిగా అంతరించకపోయినా, కనీసం ఒక గౌరవ ప్రదమయిన శక్తిగా ఉంటుందనుకున్నారు. అయితే, టిడిపిని తరిమేయడమే వ్యూహంగా కెసిఆర్ పనిచేశారు.  తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో బిసిలు అండగా ఉన్నారని అందరికి తెలిసిందే.  ఇలాంటి బిసిలు టిఆర్ ఎస్ లోకి తప్ప మరొక పార్టీ లోకి వెళ్లలేని పరిస్థితి సృష్టించారు. కాంగ్రెస్ బలహీనపడింది.బిజెపి ఎపుడు బలపడుతుందో తెలియదు. అందువల్ల చిన్నవో పెద్దవో రాజకీయ పదవులు కావాలంటే తెలుగుదేశం లాభం లేదనే పరిస్థితి క్రియోట్ చేశారు.

రాజకీయాలు  కూడా ఇపుడు ఒక ఇండస్ట్రీగా మారాయి. ఇన్వెస్టుమెంటు కు తగిన రాబడి లేకపోతే, మూసేయాల్సి వస్తుంది. తెలంగాణలో టిడిపి నేతలుఏడేళ్లుగా పార్టీకోసం భారీగా ఖర్చుచేస్తున్నారు. అయితే, పార్టీని బతికించుకోవచ్చనే ఆశని పార్టీ అధినేత చంద్రబాబు గాని, నారాలోకేష్ గాని కల్పించలేకపోయారు.

వారిద్దరు హైదరాబాద్  జూబ్లి హిల్స్, ఫామ్ హైస్ దాాటి వచ్చి, రాష్ట్రంలో పర్యటించి, భవిష్యత్తు గురించి కార్యకర్తల్లో నేతల్లో భరోసా కల్పించే స్థితిలో లేరు. ఏడళ్లయింది, వారిద్దరు ఒక్కసారి తెలంగాణలో పర్యటించలేదు.ఆయన పూర్తిగా పార్టీ స్థానిక నాయకుల చేతిలో పెట్టారు. ఇదిపనిచేయలేదు. అపుడు వర్కింగ్ ప్రెశిడెంటుగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీాలో చేరి ఎంపి అయ్యారు. ఇపుడు  పిసిసి అధ్యక్షుడయ్యాడు.

ఇక ఎల్ రమణకు మిగిలింది టిడిపి అధ్యక్షుడనే టైటిలే. తెలంగాణలో అదేమంత ప్రయోజనకరమయిన హోదా కాదు.అందువల్ల 2024 ఎన్నికల నాటిదాకా టిడిపిలో ఉన్నా సాధించేదేమీలేదు. ఇపుడే టిఆర్ ఎస్ లో చేరితే బిసి నేతగా రమణకు  2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రావచ్చు.లేదా పార్లమెంటు ఎన్నికల్లో ఎంపి టికెట్ రావచ్చు.లేదా రాజ్యసభ సీటు రావచ్చు. కనీసం ఎమ్మెల్సీ కావచ్చు.ఆధమం ఏదో ఒక కార్పొరేషన్  చెయిర్మన్ కావచ్చు.

అందువల్ల మాజీ మంత్రి అయిన రమణకి మిగిలిన ఆప్షన్ టిఆర్ ఎస్ లో చేరడమే.

ఆయన భవిష్యత్తెలా ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *