టోక్యో ఒలింపిక్స్ కు అన్నీ అవాంతరాలే…
కోవిడ్ కారణంగా 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాది జూన్ 23కు వాయిదా పడ్డాయి. గేమ్స్ ని పూర్తిగా రద్దుచేయకుండా ఉండేందుకు చాలా కోవిడ్ నియమాల మధ్య టోక్యో ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. అయితే, జపాన్ లో కోవిడ్ కేసులు పెరగడం ఆగలేదు. దీనితో జపాన్ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు దేశంలో ఎమర్జన్సీ విధించారు.
ఇప్పటికే విదేశీ ప్రేక్షకులను అనుమతించరాదని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్ణయించింది. కేవలం జపాన్ ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని, వారిని కూడా లాటరీ పద్ధతిలో ఎంపికచేయాలని నిర్ణయించారు. ఆడిటోరియాలలో కేవలం 50 శాతం కెపాసిటికే అనుమతించాలని నిర్ణయించారు.
“New cases in greater Tokyo metropolitan area have been rising since June. Stronger measures have become necessary in those areas but could be lifted early if we see evidence of the positive impact of the vaccine rollout,” అని ప్రధాని సుగా చెప్పారు.
ఈ రోజు ఎమర్జన్సీ విధించడంతో అసలు ప్రేక్షకులే లేకుండా ఒలింపిక్స్ నిర్వహించే ప్రమాదం వచ్చింది. ఎమర్జన్సీని విధిస్తున్నట్లు జపాన్ ప్రధాని యోషిహిడే సుగా దేశ ప్రజలను ద్దేశించి ప్రసంగిస్తూ ప్రకటించారు. నిజానికి ఏప్రిల్ నెలలోనే ఏమర్జన్సీ విధించారు. ఇపుడిపుడే దీనిని సడిలిస్తున్నారు. ఈ దశలో మరొకసారి ప్రధాని ఎమర్జన్సీ విధించారు.
ఈ ఏమర్జన్సీ జూలై 12 నుంచి ఆగస్టు 22వరకు అమలులో ఉంటుంది. ఒలింపిక్స్ గేమ్స్ జూలై 23 నుంచి ఆగస్టు 8 దాకా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇపుడు జపాన్ లో నడుస్తున్న కోవిడ్ నాలుగో వేవ్. ఆదేశంలో కూడా వ్యాక్సినేషన్ ఆశించినంత వేగంగా జరగడం లేదు. ఇంతవరకు కేవలం 15 శాతం మంది ప్రజలకే వ్యాక్సిన్ అందింది.