రియల్ ఎస్టేట్ హాట్ కేక్ కానున్న ఉప్పల్, హైదరాబాద్ ఈస్ట్

 

 

అందమైన హైదరాబాద్ లో ఉప్పల్ అనే మాట అంత వినసొంపుగా కనిపించదు. హైదరాబాద్ తూర్పున ఒక ముఖ్యమయిన కూడలి అయినా, ఉప్పల్ అనే మూడక్షరాలు అంత  గర్వకారణమయినవి కాదు. ఎందుకుంటే ఉప్ప అనేది మహానగరంలోని ఒకచిన్నగ్రామం. వరంగల్ వైపు వెళ్లవాందరికి ఉప్పలే హబ్. ఉప్పల్ జంక్షన్  ఎల్ బి నగర్ రింగ్ రోడ్, సికిందరాబాద్ –నాగార్జన సాగర్ రోడ్, రామాంతపూర్ రోడ్,వరంగల్  హైదరాబాద్ లో కలిసే కూడలి. ఈ పాటికి ఇది హైదరాబాద్ లో ఒక చూడముచ్చటయిన కూడలి అయి ఉండాలి. మాల్స్ తో, సినిమా కాంప్లెక్స్ , పెద్ద  రెస్టరాంట్ లత్   ఈకూడలి అభివృద్ధిచెంది ఉండాలి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఉప్పల్ వెనకబడి ఉంది. ఆమధ్య  హైటెక్ సిటి ఐటీ కేంద్రాలతో రద్దీ గా మారడంతో సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీని  డీసెంట్రలైజ్ చేసే ప్రయత్నం ఒక సారి జరిగింది. ఫలితంగా ఉప్పల్ సమీపాన  జెన్ పాక్ వచ్చింది. ఇన్ఫోసిస్ క్యాంపస్ వచ్చింది. అయితే ఆ తర్వాత  ఈ అభివృద్ధి ఆగిపోయింది. అందుకే ఉప్పల్ నిర్లక్ష్యానికి గురయింది. ఇరుకు రోడ్ల నరకంగా ఉండింది. ఇప్పటికి పల్లె టూరు లాగానే ఉంటుంది. హైటెక్ హైదరాబాద్ నీడ ఉప్పల్ మీద పడనే లేదు. ఇరుకు సందులు. ఇరుకు బాటలు. ఇరుకిరుకు మెయిన్ రోడ్… ఉప్పల్ ఏమాత్రం ఈ కాలపు యువకులకు వాంఛనీయ ప్రాంతమ్ కానే కాదు.

కాని ఇపుడు సీన్ మారిపోతాఉంది. హైదరాబాద్ ఈస్ట్ రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్ కాబోతున్నది. ఫ్లాట్లు, ప్లాట్లు కొనాలనుకునే వారికి, రియల్ ఇన్వెస్టు చేయాలనుకునే వారికి హైదరాబాద్ ఈస్టు మాంచి డెస్టినేషన్ అయిపోయింది.

ఉప్పల మెయిన్ రోడ్డు విస్తరణ జరుగుతూ ఉంది. అక్కడ ఫైవోవర్ రాబోతున్నది. ఈ రోడ్డు విశాలమయితే, ఉప్పల  మరొక కూకట్ పల్లి అవుతుంది. ఈ హంగులకు ఉప్పల్ మెట్రోస్టేషన్ తోడవుతూ ఉంది. దీనితో ఉప్పల జంక్షన్ హైదరాబాద్ లోనే ఒక విశిష్టమయిన జంక్షన్ కాబోతున్నది.

ఈ ఫ్లైవోవర్ రాగానే హైదరాబాద్ –వరంగల్ హైవే మీద  ప్రాపర్టీస్ కి రెక్కలొస్తాయి.  నగరంలోని ఇతర ప్రాంతాలలో పోలిస్తే, ప్రాపర్టీ ధరలు ఉప్పల్-ఘటకేసర్ మధ్య బాగా తక్కువగా ఉన్నాయి. ముందుచూపున్న వాళ్ల, హైదరాబాద్ అభివృద్దిని జాగ్రత్తగా గమనిస్తున్న వాళ్లు అపుడే ఉప్పల్ ఘటకేసర్ లో మధ్య ప్రాపర్టీ కొనేందుకు  వాలిపోయారు.

ఉప్పల్ ప్రాంతం ఎందుకు హైదరాబాద్ లో కీలకమయిన  ప్రాపర్టీ కాబోతున్నది?

ఉప్పల్ నుంచి  ఎయిర్ పోర్టకు వెళ్లేందుకు 45 నిమిషాలు పడుతుంది. సికిందరాబాద్ జూబ్లీ బస్స్ స్టేషన్  15 నిమిషాలు పడుతుంది. సికిందరాబాద్ రైల్వే ష్టేషన్ కు15 నిమిషాలు పడుతుంది. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ కు అరగంట పడుతుంది.  ఈ ప్రాంతంలో నే రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం ఉంది. ఉస్మానియా యూనివర్శిటీ, సిసిఎంవి, ఐఐసిటి,ఎన్ జిఆర్ ఐ, ఎన్ ఐఎన్ ల ఇన్ స్టిట్యూషనల్ ఏరియా ఇక్కడికి పది నిమిషాల దూరాన ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ కు సమీపాన ఉంటుంది.ఉప్పల్ –అంబర్ పేట్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ రాబోతున్నది. 6.1 కిమీ పొడవైన ఈ ఫైవోవర్  హైదరాబాద్ లోనే రెండో పొడవైన్ ఎలివేటెడ్ కారిడార్.  మొదటిది 11.6 కిమీ పివిఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ వే. సుమా రూ రు. 700 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. నేషనల్ హైవే మీద  ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ  అధిగమించేందుకు ఈ ఫ్లైవోవర్ నిర్మిస్తున్నారు.  ఇవన్నీ పూర్తయితే, ఉప్పల్ హైదరాబాద్ కిరీటంలో కలికి తురాయి అవుతుంది.

Uppal Elevated Corridor (credit: Telangana Today)

అంతేనా, కాదు, ఇంకా చాలా ఉంది. గ్రిడ్ పథకం కింద హైదరాబాద్ ఈస్ట్ ను ఐటి హబ్ గా మార్చేందుకు ఐటి మంత్రి తారక రామారావు ప్రయత్నిస్తున్నారు. ‘గ్రిడ్’ అంటే గ్రోత్ ఇన్ డిస్ పర్షన్ (Growth in Dispersion) అని అర్థం. అంటే ఇక ముందు , కేవలం హైటెక్ సిటిలోనే కాకుండా ఐటి పార్కులను  హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో వచ్చేలా చర్యలు తీసుకోవడం. దీనికోసం కెటిఆర్ ఉప్పల్ నాచారాం,  ఘటకేసర్ ఉన్న హైదరాబాద్ తూర్పును ఎంపిక చేశారు. కొన్ని ఇండస్ట్రియల్ పార్క్ లను ఐటి పార్క్ లుగా మార్చేందుకు అనుమతినిచ్చారు. ఈ ప్రాంతాన్ని కాలుష్య రహిత ప్రాంతం చేసేందుకు ఈచర్యలు తీసుకుంటున్నారు.

మరొక  విశేషమేమంటే, హైదరాబాద్ –భూపాల్ పట్నం వెళ్లే హైవే నెంబర్ 163  హైదరాబాద్ ఈస్టు గుండానే వెళుతుంది.  యాదాద్రి ఆలయం ప్రారంభయిన తర్వాత ఈ  హైవే రూపురేఖలు మారిపోతాయి.యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా మార్చాలనుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని హంగులు సమకూర్చాలని చూస్తున్నందన ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలేకుండా చేయడమేకాదు,  యాదాద్రికి సబర్బన్ రైలు నడిచే వీలుంది. వీటన్నింటితో ఉప్పల్ నుంచి ఘట కేసర్ దాకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్ కాబోతున్నది.  నివాసాలకు ఫ్లాట్స్, ప్లాట్స్ కొనాలనుకునేవారికి, ఇన్వెస్ట్ మెంటకోసం రియల్ ఎస్టేట్ వెచ్చించాలనుకునేవారి ఈ ప్రాంతం అనువైందని బిల్డర్లు, ప్రాపర్టీ డీలర్లు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *