పోరాడకుండానే ఒలింపిక్ బంగారు పతకం

(సలీమ్ బాషా)

1912 స్వీడన్ లోని Stockholm లో జరిగిన ఒలింపిక్స్ లైట్ హెవీ వెయిట్ కుస్తీ పోటీలో ఫైనల్స్ లో కుస్తీ పట్టకుండానే బంగారు పతకం గెలుచుకున్నాడు స్వీడన్ కు చెందిన క్లేస్ ఎడ్విన్ జొహాన్సన్  (Claes Edvin Johanson). సెమీఫైనల్స్ లో రష్యా కు చెందిన Martin Klein , ఫిన్లాండ్ కు చెందిన ఆల్ ఫెడ్ ఎసికాయినెన్ ( Alfred Asikainen) తలపడ్డారు.

ఆ మ్యాచ్ 11 గంటల 40 నిమిషాలపాటు జరిగింది. అరగంటకో సారి విశ్రాంతి కూడా తీసుకున్నారు. చివరకు రష్యా యోధుడు మార్టిన్ క్లెయిన్( Martin Klein) మ్యాచ్ గెలిచినప్పటికీ, బాగా అలసిపోవడం వల్ల ఫైనల్స్ లో పాల్గొనకుండా విరమించాడు. దాంతో క్లేస్ కు బంగారు పతకం ఇచ్చేశారు.

అదే ఒలింపిక్స్ జరిగిన మరో లైట్ హెవీ వెయిట్ కుస్తీ పోటీలో ఫైనల్ తర్వాత కూడా ఎవరికి బంగారు పతకం ఇవ్వలేదు. ఫైనల్స్ లో స్వీడన్ కు చెందిన Anders Ahlgren , ఫిన్లాండ్ పహిల్వాన్ Ivar Böhling మధ్య జరిగిన కుస్తీ పోటి 9 గంటలకు పైగా సాగింది. దాంతో ఆ పోటీ డ్రాగా ప్రకటించి ఇద్దరికీ కూడా రజత పతకమే ఇవ్వడం విశేషం! ఒలింపిక్స్ ఇలా జరగడం ఇదే మొదటిసారి!!

Saleem Basha

(సలీమ్ బాషా స్పోర్ట్స్ జర్నలిస్టు, రచయిత, హోమియో వైద్యుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *