అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసిపి అధినేత జగన్మోెహన్ రెడ్డి పరిపాలన కొత్త పుంతలు తొక్కుతూఉంది.దేశంలో ఎక్కడ లేని విధంగా ఆయన పన్నులు విధిస్తున్నారు. తొలిసారిగా ఆయన బాత్రూమ్ పన్ను వేస్తున్నారు. ఆస్తిపన్ను లెక్కించేందుకు ఆయన ప్రభుత్వం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధానం ప్రవేశపెట్టింది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఎక్కడా చూల్లేదని ఈ వీడియో ఒక మేధావి వాపోతున్నాడు. ఆయన కొత్త ఆస్తిపన్ను ప్రతిపాదనల మీద ఏర్పాటుచేసిన ఒక ప్రజాభిప్రాయసేకరణ సమావేశంలో ప్రసంగించారు.
ఇప్పటికే రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఇఎఎస్ శర్మ జగన్మోహన పన్నుల పరిపాలన మీద లేఖలు రాశారు. ఆస్తిపన్ను పెంచుతున్నాం, ప్రజాభిప్రాయం చెప్పండని చెబుతూ ఆస్తిపన్ను జీవొని ఎవరికీ, చివరకు ఇంగ్లీషు ప్రొఫెసర్లకు కూడా అర్థం కాని ఇంగ్లీష్ రాయడం మీద ఆయన ఆక్షేపణ తెలిపారు. ఇలాంటి ఇంగ్లీష్ లో జివొ విడుదల చేసి ప్రజలను అభిప్రాయం కోరితే ఎలా అని రాష్ట్రమంతా మేధావులు, పట్టణ ప్రజలు వాపోతున్నారు.
ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు పెడతానే, ఆంధ్రోళ్లంతా ఇంగ్లీషోల్లయిపోయారా?
ఆటోలు నడిపేవాళ్లు, కూరగాయలమ్మేవాళ్లు, రైతులు, కార్మికులు, కూలీలు ఇంటిపన్నుఎంత ఘోరమో తెలుసుకునే దెలా? వాళ్లకోసం తెలుగులో జివొ ముద్రించాలనే యోచన ఇంతవరకు జగన్ ప్రభుత్వానికి రాలేందంటే, కావాలనే చేస్తున్నారని అంతా విమర్శిస్తున్నారు.
బహుశా ఆస్తి పన్ను, బాత్రూం పన్ను వ్యవహారాలు జగన్ ప్రభుత్వానికి బాగా మసిపూస్తాయేమో అనిపిస్తుంది.
ఈ పన్నులు అమలులోకి రాగానే జగన్ అపకీర్తి పాలు కావడం మొదలువుతందని మేధావులు చెబుతున్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం పనికిమాలిన బ్రాండ్ల మద్యం లోకల్ గా తయారుచేయించి,జనం మీదకు వదిలి కోట్లుదండుకుంటున్నదనే విమర్శ ఉంది. ఇపుడు ఆస్తిపన్నుతో జగన్ పూర్తిగా మధ్యతరగతి ప్రజలకే కాదు, అల్పాదాయ వర్గాలకూ దూరంకాక తప్పదని చెబుతున్నారు.
ఈ వీడియో చూస్తే జగన్ఆస్తి పన్ను ప్రతిపాదన ఎంత అన్యాయమో, వినాశకారో తెలుస్తుంది. ఇది ప్రతిపక్షాల గోలకాదు, ఓటర్ల ఆక్రోశం.
ఆస్తి పన్ను వ్యవహారం మీద డాక్టర ఇఎఎస్ శర్మ ఏమంటున్నారో చదవండి
https://trendingtelugunews.com/english/trending/property-tax-based-on-revaluation-of-property-is-wrong/